Nasscom: 2021లో మరో 28 యూనికార్న్‌ స్టార్టప్‌లు..! - India adds 28 unicorns in 2021 to take total to 66 employ over 3.3 lakh people
close

Published : 28/09/2021 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nasscom: 2021లో మరో 28 యూనికార్న్‌ స్టార్టప్‌లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో 2021లో ఇప్పటి వరకూ తొమ్మిది నెలల్లో యూనికార్న్‌ స్టార్టప్‌ల జాబితాలోకి మరో 28 సంస్థలు చేరాయని నాస్‌కామ్‌ తన బ్లాగ్‌లో పేర్కొంది. దీంతో సంవత్సరం ముగిసే నాటికి గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. 2020 చివరి నాటికి యూనికార్న్‌ స్టార్టప్‌ల సంఖ్య 38 ఉండగా.. అది ప్రస్తుతం 66కు చేరుకొంది. బిలియన్‌ డాలర్ల విలువ దాటిన స్టార్టప్‌లను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. ఈ మొత్తం సంస్థల్లో 90శాతం 10ఏళ్లు అంతకంటే తక్కువ సమయంలోనే యూనికార్న్‌ హోదా దక్కించుకోవడం గమనార్హం. 

ప్రస్తుతం భారత్‌లో ఉన్న 66 యూనికార్న్‌ల ఆదాయం 15 బిలిలియన్‌ డాలర్లుగా నిలిచింది. వీటిల్లో మొత్తం 3.3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఏడు యూనికార్న్‌ల్లో ఉద్యోగుల సంఖ్య 10వేలను దాటేసింది. మొత్తం 66 సంస్థలు కలిపి జీవిత కాలంలో 51 బిలియన్‌ డాలర్లను సమీకరించాయి. వీటిల్లో 18శాతం యూనికార్న్‌లు ఒక్కోటి బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడిని పొందాయి. 

* తాజాగా భారత్‌ యూనికార్న్‌ల జాబితాలో స్థానం పొందిన సంస్థల్లో అత్యధికంగా 2010(8) , 2011(9),2015(10)ల్లో ప్రారంభించినవే.

* మొత్తం యూనికార్న్‌ స్టార్టప్‌ల్లో 60శాతం సంస్థలు ఈకామర్స్‌, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌, ఫిన్‌టెక్‌ విభాగాల్లోనే ప్రారంభించారు. సమీకరించిన నిధులు కూడా అత్యధికంగా ఈ రంగాల్లో వాటికే దక్కాయి. 

* దేశంలోని మూడో వంతు యూనికార్న్‌ స్టార్టప్‌లు బెంగళూరులోనే ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతం ఉంది. 

* బైజూస్‌, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్‌ విలువ 10 బిలియన్‌ డాలర్లను దాటేసినట్లు నాస్‌కామ్‌ తన బ్లాగ్‌లో వెల్లడించింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని