Electric Vehicles: 2027 నాటికి పెట్రోల్‌ బైక్‌లకు స్వస్తి చెప్పాలి! - India must end petrol two wheelers by 2027 says Hero Electric MD
close

Published : 22/09/2021 21:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Electric Vehicles: 2027 నాటికి పెట్రోల్‌ బైక్‌లకు స్వస్తి చెప్పాలి!

హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజల్‌ ఆకాంక్ష

దిల్లీ: ప్రపంచ దేశాలు స్వచ్ఛ ఇంధన వాహనాల వైపు మళ్లుతున్నాయని హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజల్‌ తెలిపారు. భారత్ సైతం ఆ దిశగా వేగవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2027 నాటికి భారత్‌లో ద్విచక్రవాహన విక్రయాలు పూర్తిగా విద్యుత్తువే అయి ఉండాలని ఆకాంక్షించారు. అప్పటి కల్లా పెట్రోల్‌ ఆధారిత టూ వీలర్స్‌ విక్రయాలు ఆపేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విపణి శక్తులకు వదిలేస్తే పెట్రోల్‌ నుంచి విద్యుత్తుకు జరగాల్సిన మార్పు నెమ్మదించే అవకాశం ఉందని హెచ్చరించారు.

అధిక ధరలు, ఛార్జింగ్ వసతుల లేమి వల్లే భారత్‌లో విద్యుత్తు వాహనాలకు గిరాకీ పెరగడం లేదని నవీన్‌ తెలిపారు. కార్లతో పోలిస్తే ద్విచక్రవాహనాల వల్లే అధిక కాలుష్యం జరుగుతుందన్నారు. అయినా, 2019 నాటికి దేశంలో 29.6 కోట్ల ద్విచక్రవాహనాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్తు వాహనాల తయారీ దిశగా మారేలా కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే కంపెనీలు ఓ నిర్దిష్టమైన లక్ష్యాలతో పనిచేస్తాయన్నారు.

ఇప్పటి వరకు భారత్‌లో టీవీఎస్‌, హీరో మోటోకార్ప్‌, హీరో ఎలక్ట్రిక్‌, ఓలా ఎలక్ట్రిక్‌, యమహా సహా మరికొన్ని సంస్థలు విద్యుత్తు ద్విచక్రవాహనాలను తయారు చేస్తున్నాయి. ఇంకా కొన్ని సంస్థలు ఆ దిశగా మారాల్సి ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని