RBI: కరోనాలోనూ కరెంట్‌ ఖాతా మిగులు  - India reports current account surplus in pandemic-affected FY21
close

Updated : 01/07/2021 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

RBI: కరోనాలోనూ కరెంట్‌ ఖాతా మిగులు 

2020-21లో 0.9 శాతం  
ఎఫ్‌డీఐలు, ఎఫ్‌పీఐలోనూ వృద్ధి 
బ్యాంకుల రుణాలూ పెరిగాయ్‌: ఆర్‌బీఐ

 ముంబయి: కరోనా ఇబ్బంది పెట్టిన 2020-21 ఏడాదిలో భారత్‌ తన జీడీపీలో 0.9 శాతం మేర కరెంట్‌ ఖాతా మిగులును నమోదు చేయడం విశేషం. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 0.9 శాతం కరెంట్‌ ఖాతా లోటు నమోదైంది. 
మార్చి త్రైమాసికంలో కరెంట్‌ ఖాతా లోటు 8.1 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 1 శాతానికి చేరింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 0.6 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 0.1 శాతంగా మాత్రమే ఉంది. ఇక డిసెంబరు త్రైమాసికం(2020-21)లోనూ లోటు 0.3 శాతంగా నమోదైనట్లు బుధవారం ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో వాణిజ్య లోటు 157.5 బిలియన్‌ డాలర్ల నుంచి 102.2 బిలియన్‌ డాలర్లకు తగ్గడంతో కరెంట్‌ ఖాతా నిల్వలు కాస్తా మిగులులోకి వెళ్లాయని ఆర్‌బీఐ పేర్కొంది. 

> కరోనా ఉన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 43 బి. డాలర్ల నుంచి 44 బిలియన్‌ డాలర్లకు పెరిగాయని తెలిపింది. 
> నికర విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా 1.4 బి. డాలర్ల నుంచి ఏకంగా 36.1 బి. డాలర్లకు పెరిగాయి. 
> 2020-21లో విదేశీ మారక నిల్వలు 99.2 బిలియన్‌ డాలర్ల మేర పెరిగాయి. అంతక్రితం ఏడాది 64.9 బి. డాలర్లే వృద్ధి చెందాయి. ఇతర ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు క్షీణించడం ఇందుకు నేపథ్యం. 
మార్చి 2021 నాటికి భారత విదేశీ రుణాలు 11.5 బిలియన్‌ డాలర్లు పెరిగి 570 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ రుణాలు, జీడీపీ మధ్య నిష్పత్తి అంతక్రితం ఏడాది మార్చి చివరతో పోలిస్తే 20.6 శాతం నుంచి 21.1 శాతానికి పెరిగింది. 
విదేశీ వాణిజ్య రుణాలు అంతక్రితం ఏడాది 21.7 బి. డాలర్లు ఉండగా.. 2020-21లో 0.2 బి. డాలర్లుగానే నమోదయ్యాయి. 
బ్యాంకుల ఆహారేతర రుణాల వృద్ధి మే 2021లో 5.9 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది. అయితే వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాలు మాత్రం మే 2020లో 5.2 శాతం పెరగ్గా.. ఈ ఏడాది మే నెలలో 10.3 శాతం వృద్ధి చెందడం విశేషం. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని