భారత్‌లో ఇళ్ల ధరలు తగ్గాయ్‌  - India stands low at 55th spot in global annual housing price appreciation
close

Published : 11/06/2021 12:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో ఇళ్ల ధరలు తగ్గాయ్‌ 

నైట్‌ ఫ్రాంక్‌ పరిశోధనా నివేదిక

దిల్లీ: దేశంలో ఇళ్ల ధరలు 2020 జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో 1.6 శాతం మేర తగ్గాయని నైట్‌ ఫ్రాంక్‌ పరిశోధనా నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా గృహాల ధరల్లో వార్షిక వృద్ధి ఎలా ఉందనే అంశంపై నైట్‌ ఫ్రాంక్‌ రూపొందించిన నివేదికలో భారత్‌కు 55వ స్థానం లభించింది. స్థిరాస్తి ధరలు 32 శాతం పెరగడంతో, ఈ నివేదికలో టర్కీ అగ్ర స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 56 దేశాలతో రూపొందించిన ఈ నివేదికలో భారత్‌ 55వ స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. 56వ స్థానంలో స్పెయిన్‌ నిలిచింది. గత మార్చిలో విడుదల చేసిన నివేదికలో 56వ స్థానంలో ఉన్న భారత్‌ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుంది. 2020 తొలి త్రైమాసికంలో 43వ స్థానంలో ఉండగా, తాజాగా 12 స్థానాలు కోల్పోయింది. స్పెయిన్‌లో 1.8 శాతం ధరలు క్షీణించగా, భారత్‌లో 1.6 శాతం మేర క్షీణించినట్లు నివేదిక తెలిపింది. ఇదిలా ఉంటే తొలి 3 స్థానాల్లో నిలిచిన దేశాల్లో ధరల వృద్ధి పట్టికలో..
దేశం             ధరల్లో వృద్ధి (శాతంలో)
టర్కీ                   32
న్యూజిలాండ్‌             22.1
లగ్జెంబర్గ్‌                 16.6     


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని