టాటా వాణిజ్య వాహన విభాగంపై దర్యాప్తు - Indias Competition Regulator Orders Antitrust Probe Into Tata Motors Commercial Vehicle Business
close

Published : 06/05/2021 22:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాటా వాణిజ్య వాహన విభాగంపై దర్యాప్తు

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటా మోటార్స్‌లోని వాణిజ్య వాహన విభాగంపై యాంటీ ట్రస్ట్‌ దర్యాప్తు నిర్వహించాలని కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తే టాటామోటార్స్‌ తన స్థానాన్ని వాడుకొన్నట్లు తెలుస్తోందని.. దర్యాప్తు లోతుగా జరగాల్సి ఉందని వెల్లడించింది. పెనీకి చెందిన ఒకప్పటి డీలర్‌ ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ నిర్ణయం తీసుకొంది. తాము ఎన్ని వాహనాలను స్టాక్‌ ఉంచుకోవాలి వంటి అంశాలను కంపెనీనే నిర్ణయిస్తుందని ఈ సంస్థ ఆరోపించింది. 

 కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలపై టాటామోటార్స్‌ ప్రతినిధి స్పందించారు.  ‘‘కాంపిటేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల విభాగంపై విచారణ నిర్వహించాలని సీసీఐ డీజీని ఆదేశించింది. ఇవి ప్రాథమిక ఆదేశాలే. ఇది తుది ఉత్తర్వులు కాదు. టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ప్రస్తుతం సీసీఐ ఉత్తర్వులను పరిశీలిస్తోంది. దీనిపై న్యాయపరమైన సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకొంటాము’’ అని పేర్కొంది.  ప్రస్తుతం టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల మార్కెట్లో 40శాతం వాటాను కలిగిఉంది. ఈ కంపెనీనే దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహన విక్రయదారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని