close

Published : 06/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అంచనాల కంటే మెరుగ్గా భారత్‌ ఆర్థిక వ్యవస్థ

ఆర్థిక వ్యవహారాల విభాగం

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే మెరుగ్గా రాణిస్తోందని ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని అంచనా వేసిన సంగతి విదితమే. అయితే పరిస్థితులు మరింత మెరుగవుతున్నందున, జీడీపీ క్షీణత ఇంత ఉండకపోవచ్చని ఆర్థిక వ్యవహారాల విభాగం తమ నెలవారీ నివేదికలో పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, టీకాల కార్యక్రమం కొనసాగుతుండటంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా మాత్రం ఉత్పత్తి రికవరీ మళ్లీ నెమ్మదించిందని, అభివృద్ధి చెందిన దేశాల్లో కొత్త రకం వైరస్‌ ఉత్పరివర్తనాలు వస్తుండటంతో పలు చోట్ల లాక్‌డౌన్‌ విధించడం ఇందుకు కారణమని వివరించింది.కొవిడ్‌ మహమ్మారి రెండో దశ ఉద్ధృతిని అరికట్టేందుకు భారత్‌ ఎంత ప్రయత్నించినా, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, హరియాణా వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేసింది. అందుకే ఎక్కువ మందికి టీకాలు వేసి, సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సాధించే వరకు ప్రజలు భౌతిక దూరాన్ని తప్పక పాటించాలని తెలిపింది.  ‘దేశీయంగా  భౌతిక దూరం పాటించడం (సోషల్‌ వ్యాక్సిన్‌) చాలా అవసరమ’ని నివేదిక వెల్లడించింది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని