
తాజా వార్తలు
రైట్ రైట్.. భారత్‌లో తొలి ప్లాస్టిక్ రోడ్డు!
నొయిడా: దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రహదారి నిర్మాణం చేపట్టారు. నొయిడా- గ్రేటర్ నొయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా సెక్టర్ 129 వద్ద ఈ రోడ్డు నిర్మాణం జరిగిందని అధికారులు వెల్లడించారు. 500 మీటర్ల నిడివి గల దీని నిర్మాణంలో 35 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించినట్లు వారు తెలిపారు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), నొయిడా పురపాలక యంత్రాంగంతో చేసుకున్న ఒప్పందం మేరకు పైలట్ ప్రాజెక్టుగా దీనిని నిర్మించినట్టు అధికారులు తెలిపారు. పనికిరాని ప్లాస్టిక్ వస్తువులతో దిమ్మెలను తయారు చేసి.. వాటిని రోడ్డు నిర్మాణంలో ఉపయోగించామని వారు వివరించారు. ఈ విధానంలో తొలుత ప్లాస్టిక్ దిమ్మెలను పరిచిన అనంతరం.. దానిపై రెండు పొరల తారును వేస్తామన్నారు. ఈ ప్లాస్టిక్ రహదారి పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టైతే.. ఈ విధమైన రోడ్లను దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తామన్నారు.
రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం దేశంలోనే ఇది తొలిసారని బీపీసీఎల్ జనరల్ మానేజర్ రాజీవ్ త్యాగి అన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు పరిష్కారం లభించినట్టే అని ఆయన వివరించారు. కాగా, ఈ వినూత్న ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- బాధ్యతల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్
- పంజాబ్, హరియాణాల్లో హై అలర్ట్
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- అందుకు పశ్చాత్తాప పడుతున్నా
- తెల్ల బియ్యమా? దంపుడు బియ్యమా?
- అమ్మకానికి 60 లక్షల మంది భారతీయుల నెంబర్లు
- మాక్సీకి రూ.10 కోట్లు చెల్లిస్తే తెలివిలేనట్లే!
- ప్లాన్లేమీ లేవ్..బయటికొచ్చి బాదడమే: శార్దూల్
- దాదా కాల్ చేశాడు..క్రెడిట్ ద్రవిడ్‌కే: రహానె
ఎక్కువ మంది చదివినవి (Most Read)
