close

Published : 26/02/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2021-22లో భారత్‌ వృద్ధి 13.7%: మూడీస్‌

దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) భారత ఆర్థిక వ్యవస్థ 13.7 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం క్షీణత నమోదు చేయవచ్చని పేర్కొంది. కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావడంతో మార్కెట్లలో విశ్వాసం పెరుగుతుండటం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో వృద్ధి గాడిన పడుతోందని తెలిపింది. జీడీపీ 2020-21లో 10.6 శాతం క్షీణతను, 2021-22లో 10.8 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని గత నవంబరులో మూడీస్‌ అంచనాలు వెలువరించింది. ఇప్పుడు అంచనాలను పెంచింది. దేశీయంగా కార్యకలాపాలు ఊహించిన దాని కంటే పుంజుకోవడంతో అంచనాలు సవరించామని మూడీస్‌ పేర్కొంది.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని