పేదలు పెరిగారు.. మధ్యతరగతి తగ్గారు! - Indias middle class down by 32 mn in 2020
close

Published : 19/03/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేదలు పెరిగారు.. మధ్యతరగతి తగ్గారు!

భారత ప్రజల ఆర్థిక పరిస్థితిపై కరోనా తీవ్ర ప్రభావం

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా మహమ్మారి మూలంగా 2020లో మధ్యతరగతి జనాభా 3.2 కోట్లు తగ్గిందని ప్యూ రీసెర్చి సెంటర్‌ నివేదిక వెల్లడించింది. మరో 7.5 కోట్ల మందిని దారిద్ర్య రేఖ దిగువకు నెట్టిందని పేర్కొంది. ఈ విషయంలో చైనా మెరుగైన స్థానంలో ఉందని తెలిపింది. ఆ దేశ మధ్యతరగతి జనాభా కోటి మాత్రమే తగ్గిందని పేర్కొంది. ఇక పేదల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.

మహమ్మారి వెలుగులోకి రావడానికి ముందు భారత్‌లో 2020లో 9.9 కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు ఉంటారని అంచనా వేశారు. కానీ, ఏడాది గడిచిన తర్వాత ఆ సంఖ్య 6.6 కోట్లకు చేరనున్నట్లు లెక్కగట్టారు. ఇక భారత్‌లో పేదల సంఖ్య 5.9 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తే ఆ సంఖ్య 13.4 కోట్లకు చేరనున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తోందని తెలిపారు. 2020లో పేదిరకం రేటు 9.7 శాతంగా ఉండనుందని తాజాగా అంచనా వేశారు. 2020 జనవరిలో దీన్ని 4.3 శాతంగా లెక్కగట్టారు.

భారత్‌లో జనాభాను ప్యూ ఏజెన్సీ ఐదు వర్గాలుగా విభజించింది. రోజు రెండు డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయంతో జీవించే వారిని పేదలుగా వర్గీకరించింది. అలాగే 2.01-10 డాలర్ల ఆదాయం ఉన్న వారిని తక్కువ ఆదాయశ్రేణిగా, 10.01-20 డాలర్లు ఆదాయం ఉన్న వారిని మధ్యతరగతిగా, 20.01-50 డాలర్లు ఆదాయం ఆర్జించే వారిని ఎగువ మధ్యతరగతిగా, 50 డాలర్ల కంటే ఎక్కువ సంపాదించే వారిని అధిక ఆదాయ వర్గంగా పేర్కొంది.

ఇవీ చదవండి...

ఆభరణాలకు 35 శాతం గిరాకీ!

భారత్‌లో ఇళ్ల ధరలు తగ్గాయ్‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని