మార్చిలో నెమ్మదించిన సేవారంగం - Indias services sector activities slowed down in March
close

Published : 07/04/2021 22:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్చిలో నెమ్మదించిన సేవారంగం

 

దిల్లీ: మార్చిలో సేవా రంగ కార్యకలాపాలు నెమ్మదించాయి. ఈ రంగంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 55.3గా నమోదైంది. అంతకుముందు నెలలో ఇది 54.6గా రికార్డయింది. అయితే పీఎంఐ 50కిపైగా నమోదవ్వడం వరుసగా ఇది ఆరో నెల. పీఎంఐ సూచీ 50 పాయింట్లను మించితే ఆ రంగంలో వృద్ధిని సూచిస్తుంది. 50 పాయింట్ల లోపు ఉంటే క్షీణతకు సంకేతం. ఈ మేరకు ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నెలవారీ నివేదిక బుధవారం విడుదలైంది. 

ఎన్నికల కారణంగా సేవా రంగానికి డిమాండ్‌ పెరిగినప్పటికీ.. మరోసారి కరోనా కేసులు పెరుగడం గిరాకీని కట్టడి చేసిందని ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ప్రతినిధి లీమా తెలిపారు. కేసుల విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ రంగం మరింత నెమ్మదించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

మరోవైపు నిర్వహణ, పెట్టుబడి వ్యయాలు పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న వ్యాపారులు తెలిపినట్లు నివేదిక వెల్లడించింది. కానీ, కరోనా నేపథ్యంలో పోటీ పెరిగి విక్రయ ధరలు మాత్రం యథాతథంగా కొనసాగించాల్సి వస్తోందని పేర్కొంది. రానున్న 12 నెలల్లో గిరాకీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. 

ప్రయాణ, నిల్వ సేవలే మార్చిలో సేవా రంగానికి బలాన్నిచ్చాయి. వినయోగదారుల సేవలు, ఆర్థిక, బీమా రంగ సేవలు సైతం విస్తరణ బాటలో పయనించాయి. వ్యాపార సేవలు, ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, స్థిరాస్తి రంగ సేవల్లో క్షీణత నమోదైంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని