2025-26 కల్లా ప్రపంచ వృద్ధిలో భారత్‌ వాటా 15% - Indias share of global growth to be 15 percent by 2025-26
close

Updated : 20/01/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2025-26 కల్లా ప్రపంచ వృద్ధిలో భారత్‌ వాటా 15%

యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా

దిల్లీ: తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, కార్మిక చట్టాలు, ఎఫ్‌డీఐ నిబంధనల్లో సడలింపులు, ప్రైవేటీకరణ లాంటి సంస్కరణలు ఉత్పాదకత పెరిగేందుకు, దీర్ఘకాలంలో భారత్‌ 7.5- 8 శాతం వృద్ధిని సాధించేందుకు దోహదం చేస్తాయని ఓ నివేదిక పేర్కొంది. ఇదే జరిగితే  2025-26 కల్లా ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత్‌ వాటా 15 శాతానికి చేరుతుందని పేర్కొంది. చైనాలో తయారీ వ్యయాలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ దేశం నుంచి తయారీ కేంద్రాలను మార్చేందుకు కంపెనీలు నిర్ణయం తీసుకుంటే భారత్‌, వియత్నాం ఎక్కువగా ప్రయోజనం పొందే అవకాశం ఉందని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌లో భారత ఆర్థికవేత్త తాన్వి గుప్తా తన నివేదికలో తెలిపారు. స్థానిక విపణుల్లో ఉన్న వృద్ధి అవకాశాలు, తక్కువ కార్మిక వ్యయాలు, సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం, సంస్కరణల వేగం కొనసాగుతుందన్న ఆశాభావం లాంటివి కూడా వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వృద్ధిలో భారత్‌ 15 శాతం వాటా సాధించేందుకు తోడ్పడుతుందని తెలిపారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని