close

Updated : 04/05/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మారుతీ సుజుకీ కీలక నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓ పక్క భారత్‌లో కొవిడ్‌ కేసులు పెరిగిపోతుండటంతో దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ కీలక నిర్ణయం తీసుకొంది. తన ఉత్పత్తి సామర్థ్యంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఆక్సిజన్‌ అవసరాలు తీర్చేందుకు కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేసింది. కంపెనీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ ‘‘చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించడంతో విక్రయాలపై ప్రభావం పడింది. దాదాపు సగానికిపైగా కార్‌డీలర్‌షిప్‌లు మూతపడ్డాయి. ఇప్పటికీ మేము 50శాతం నుంచి 60శాతం సామర్థ్యంతో కార్లను ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నాము’’ అని పేర్కొన్నారు. 

గత మూడు రోజుల నుంచి ఆర్డర్లలో 5శాతం వరకు తగ్గుదలను గమనించినట్లు మారుతీ పేర్కొంది. కరోనా మహమ్మారి  భవిష్యత్తులో డిమాండ్‌ను బలమైన దెబ్బకొడుతుందనడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తోంది. భారత్‌లో వైద్యశ్రేణి ఆక్సిజన్‌ను ఇతర అవసరాల కోసం వినియోగించకూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కార్లతయారీలో దీనిని ఎక్కువగా వాడకపోయినా.. విడిభాగాల కంపెనీలు మాత్రం గణనీయంగానే వినియోగిస్తుంటాయి. 

కొవిడ్‌ కేసులతో మరో ఆటో దిగ్గజం హీరోమోటార్స్‌ కూడా అన్ని తయారీ యూనిట్లలో గత నెల కార్యకలాపాలను నిలిపివేసింది. అశోక్‌ లైల్యాండ్‌ కూడా ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. దీంతో మే నెలలో ఏడు నుంచి 15 రోజులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని భావిస్తున్నారు. 

 

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని