నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు - Indices are trading in losses
close

Published : 23/04/2021 09:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 134 పాయింట్లు కోల్పోయి 47,945 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 29 పాయింట్లు నష్టపోయి 14,376 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.03 వద్ద కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టైటాన్‌ కంపెనీ, శ్రీ సిమెంట్‌, టాటా కన్జూమర్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడం మదుపర్లను కలవరపెడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని