బుల్‌ జోరుకు బ్రేక్‌  - Indices ends winning streak
close

Updated : 09/02/2021 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్‌ జోరుకు బ్రేక్‌ 

ముంబయి: దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ జోరుకు అడ్డుకట్టపడింది. గత కొన్ని రోజులుగా వరుస లాభాలతో కొత్త రికార్డులను అధిరోహించిన సూచీలు.. మంగళవారం నాటి సెషన్‌లో అమ్మకాల ఒత్తిడితో ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆరంభ లాభాలను కోల్పోయి.. ఫ్లాట్‌గా ముగిశాయి.

బడ్జెట్‌ బూస్ట్‌, విదేశీ పెట్టుబడుల రాకతో గత ఆరు సెషన్లలో దూసుకెళ్లిన సూచీలు.. మంగళవారం కూడా అదే ఉత్సాహంతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. 51,483.23 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌ ఒక దశలో 51,835 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. అయితే ఆ తర్వాత ఫార్మా, ఔషధ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒడుదొడుకులకు లోనైన సూచీ 51,193.93 వద్ద కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివరకు స్వల్పంగా 20 పాయింట్ల నష్టంతో 51,329.08 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 6.50 పాయింట్ల అత్యల్ప నష్టంతో 15,109.30 వద్ద ముగిసింది. ఎనర్జీ, మౌలికం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టపోగా.. ఎస్‌బీఐ లైఫ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఓఎన్‌జీసీ, టైటాన్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.

ఇదీ చదవండి..

ఫిబ్రవరి 15 వచ్చేస్తోంది.. ఫాస్టాగ్‌ తీసుకున్నారా?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని