బుల్‌ బడ్జెట్‌ ఉత్సాహం..  - Indices extend Budget day gain
close

Updated : 02/02/2021 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బుల్‌ బడ్జెట్‌ ఉత్సాహం.. 

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల్లో బడ్జెట్‌ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 9.43కు సెన్సెక్స్‌ 1,311 పాయింట్లు పెరిగి 49,911 వద్ద, నిఫ్టీ 381 పాయింట్లు పెరిగి14,662  వద్ద ట్రేడవుతున్నాయి. ఫినోలెక్‌ ఇండస్ట్రీ, ఐఐఎఫ్‌ఎల్‌ ఫినాన్స్‌, ఎంఎస్‌టీసీ, చోళమండలం ఫినాన్స్‌ కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా.. నూక్లియస్‌ సాఫ్ట్‌వేర్‌, హెచ్‌ఈజీ, ఫిలిప్స్‌ కార్బన్‌, మంగళూరు రిఫైన్‌, కెన్నామెటల్‌ ఇండియా వంటి సంస్థలు నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్‌ నేడు 50వేల మార్కును కూడా మరోసారి దాటింది.

ప్రధాన రంగాల సూచీలన్నీ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై వ్యయాలు పెరగడం మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. దీనికి తోడు పన్నుల భారం ఎక్కువగా ఉండకపోవడం కూడా కలసి వచ్చింది. నిఫ్టీ ఫినాన్షియల్‌ సర్వీస్‌, నిఫ్టీ బ్యాంక్‌ సూచీలు దూసుకుపోతున్నాయి. నేడు హెచ్‌డీఎఫ్‌సీ, బాలాపూర్‌ చినీ, డిక్సాన్‌ టెక్నాలజీస్‌ వంటి కంపెనీలు ఫలితాలను వెల్లడించనున్నాయి.

ఇవీ చదవండి

నిర్భర బాట.. నిధుల వేట

నచ్చావులే

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని