నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు..  - Indices extends losses
close

Updated : 15/01/2021 10:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు.. 

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలతో పాటు ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ లాంటి దిగ్గజ షేర్లు నష్టాల్లో ఉండటం సూచీలపై ప్రభావం చూపిస్తోంది. క్రితం సెషన్లో కొత్త గరిష్ఠాలను చేరుకున్నప్పటికీ.. నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో ఉదయం 9.52 నిమిషాలకు సెన్సెక్స్‌ 266 పాయింట్ల నష్టంతో 49,317 వద్ద.. నిఫ్టీ 80 పాయింట్లకుపైగా నష్టంతో 14,515 వద్ద కొనసాగుతున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌, టాటాస్టీల్‌, గెయిల్‌, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటోకార్ప్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, శ్రీ సిమెంట్స్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని