సరికొత్త శిఖరాలకు సూచీలు..!  - Indices hit fresh high
close

Updated : 01/01/2021 16:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త శిఖరాలకు సూచీలు..! 

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం ట్రేడింగ్‌ను ఉత్సాహంగా ప్రారంభించాయి. సోమవారం ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి. ఉదయం 9.23 సమయంలో నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 13,843 వద్ద, సెన్సెక్స్‌ 308 పాయింట్లు పెరిగి 47,281 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఉదయం ఒక దశలో 100పాయింట్లకు పైగా లాభపడింది. ఫలితంగా సూచీలు సరికొత్త శిఖరాలకు చేరాయి.

పైసాలో డిజిటల్‌, ఫస్ట్‌సోర్స్‌ సొల్యూషన్స్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, సీఈఎస్‌ఈ వెంచెర్స్‌, జేపీ అసోసియోట్స్‌ షేర్లు భారీగా లాభపడగా.. డిష్‌టీవీ, బయోకాన్‌, ఒమాక్స్‌, ఇండియా టూరిజం, బీఏఎస్‌ఎఫ్‌ ఇండియా షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు మంచి లాభాల్లో ఉండటం విశేషం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 900 బిలియన్‌ డాలర్ల కరోనా ప్యాకేజీపై సంతకం చేయడం మార్కెట్లో జోష్‌  నింపింది.

ఇవీ చదవండి

వింగ్‌లూంగ్.. తొంగిచూస్తే కూల్చేస్తాం..!

బ్రెగ్జిట్‌.. కొవిడ్‌.. వ్యాక్సిన్‌

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని