Stock Market: కొత్త గరిష్ఠాలకు సూచీలు - Indices hit with new life time records
close

Published : 15/06/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: కొత్త గరిష్ఠాలకు సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజులు లాభాల బాట పట్టిన సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి దిగ్గజ షేర్లలో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 16వేల మార్క్‌కు మరింత చేరువైంది.

ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ఉత్సాహన్ని కొనసాగించాయి. 52,751 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌.. ఒక దశలో 52,869 వద్ద సరికొత్త రికార్డును తాకింది. ఆ తర్వాత కాస్త ఒడుదొడుకులకు లోనైనప్పటికీ చివరకు 221.52 పాయింట్ల లాభంతో 52,773 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 57.40 పాయింట్లు లాభపడి 15,869.30 వద్ద ముగిసింది. 

రంగాల వారీగా.. బ్యాంకింగ్, ఐటీ, రియల్టీ, చమురు రంగ షేర్లు రాణించగా.. ఫార్మా, లోహ రంగాల షేర్లలో అమ్మకాలు జరిగాయి. నిఫ్టీలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునిలివర్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడగా.. దివిస్‌ ల్యాబ్స్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, హిందాల్కో, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు నష్టపోయాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని