close

Published : 22/04/2021 09:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Corona Effect: నష్టాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలున్నప్పటికీ.. దేశంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులు, పలు రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్‌డౌన్లు, ఆంక్షలతో వరుసగా మూడో సెషన్‌లో సూచీలు కుదేలవుతున్నాయి. గురువారం ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 350 పాయింట్లు దిగజారి 47,355 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 14,206 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 450 పాయింట్లకు పైగా పతనమైంది. టాటాస్టీల్‌, రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా తదితర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని