Stock Market: భారీ నష్టాలతో మొదలైన సూచీలు - Indices open lower
close

Updated : 14/06/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: భారీ నష్టాలతో మొదలైన సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు.. మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు గతవారం సూచీలు రికార్డు స్థాయిలో గరిష్ఠాలను నమోదు చేయడంతో నేడు మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆరంభం నుంచే సూచీలు కుదేలవుతున్నాయి. ఉదయం 9.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 364 పాయింట్లు దిగజారి 52,111 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల నష్టంతో 15,661 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఒక శాతం మేర నష్టాల్లో ఉన్నాయి. దేశీయంగా లోహ, రియాల్టీ, బ్యాంకింగ్‌, విద్యుత్‌ రంగ షేర్లు 1-2 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని