మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు - Indices open with new highs amid positive global cues
close

Published : 09/02/2021 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లలో కొనసాగుతున్న లాభాల జోరు

ముంబయి: దేశీయ మార్కెట్లలో బుల్‌ దూసుకెళ్తోంది. వరుస లాభాలతో దుమ్మురేపుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దిగ్గజ షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా ఏడో రోజు సూచీలు లాభాలతో మొదలయ్యాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో దూకుడు మొదలుపెట్టగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 15,200 మార్క్‌కు చేరువవుతోంది. ఉదయం 9.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 51,571 వద్ద, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 15,186 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీసీ, విప్రో, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణిస్తుండగా.. బ్యాంకింగ్‌, ఆటో షేర్లు నష్టాల్లో మొదలయ్యాయి.

ఇవీ చదవండి..

సూచీల ఆధారిత బీమా పాలసీ

57శాతం పెరిగిన బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదులు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని