Stock Market: నష్టాల్లో సూచీలు - Indices witness volatile session
close

Updated : 14/05/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock Market: నష్టాల్లో సూచీలు

ముంబయి: దేశీయ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది.  అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో నేటి ట్రేడింగ్‌ను ఫ్లాట్‌గా ఆరంభించిన సూచీలు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 184 పాయింట్లు నష్టపోయి 48,507 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 14,631 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఏషియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, హిందాల్కో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని