Infosys: కొత్త శిఖరాలను చేరిన ఇన్ఫీషేర్లు..! - Infosys hits new high as buyback via open route commences on Friday
close

Published : 24/06/2021 13:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Infosys: కొత్త శిఖరాలను చేరిన ఇన్ఫీషేర్లు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో భారీగా లాభపడ్డాయి. ఒక దశలో 2.5శాతం వరకు పెరిగి రూ.1,539.90కి చేరాయి. ఇటీవల ఇన్ఫోసిస్‌ రూ.9,200 కోట్ల విలువైన షేర్లను ఓపెన్‌ రూట్‌లో బైబ్యాక్‌ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌ శుక్రవారం నుంచి  మొదలు కానుంది. దీంతో ఈ షేర్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. గత నెల రోజుల్లో ఈ కంపెనీ షేరు విపరీతంగా పెరిగింది. నెల రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5శాతం పెరిగితే అదే సమయంలో ఇన్ఫీ షేరు 14 శాతం పెరిగింది. నేటి ఉదయం 11 గంటల సమయంలో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ విలువ రూ.6.5లక్షల కోట్లను దాటేసింది. 

ఇన్ఫోసిస్‌ రూ.1,750 ధర వద్ద షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. ఈ విషయాన్ని గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ప్రకటించింది. దీనికి ఏప్రిల్‌ 14న బోర్డు అనుమతి కూడా లభించింది. ఇక అదే నెల 19వ తేదీన 40వ ఏజీఎంలో వాటాదారుల అనుమతి కూడా తీసుకొంది. ఇన్ఫోసిస్‌ దీనిపై మాట్లాడుతూ కంపెనీ మధ్యకాల నగదు అవసరాలను దృష్టిలో పెట్టుకొని  మిగులు నగదును సభ్యులకు సమర్థవంతమైన మార్గాల్లో పంపిణీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. బైబ్యాక్‌ వల్ల మిగులు నగదు సభ్యులకు పంపిణీ చేయడం సాధ్యమవుతుంది. అంతేకాదు, షేరు ఈపీఎస్‌ కూడా మెరుగవుతుంది. షేర్ల సంఖ్య తగ్గడంతో అప్పటికే వాటాలు కొన్నవారి భాగస్వామ్యం కంపెనీలో పెరుగుతుంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని