డిజిలాక‌ర్‌లో బీమా పాల‌సీ ప‌త్రాలు - Insurance-policies-in-Digilocker-in-electronic-form
close

Published : 10/02/2021 12:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిజిలాక‌ర్‌లో బీమా పాల‌సీ ప‌త్రాలు

ప్రస్తుతం, డ్రైవింగ్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్, ఓటరు ఐడి, పాన్ కార్డ్, పాఠశాల, కాలేజ్ స‌ర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన అనేక ఇతర పత్రాలను డిజిటల్‌గా భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు.

త్వరలో, మీరు మీ బీమా పాలసీలను డిజిలాకర్‌లో ఎలక్ట్రానిక్ రూపంలో ఉంచగలుగుతారు. బీమా రంగాన్ని డిజిటలైజేషన్ చేయాలనే ఆలోచనతో, పాలసీదారులకు బీమా ప్ర‌క్రియ‌ సులభతరం చేయాలనే లక్ష్యంతో, బీమా కంపెనీలు డిజిలాకర్ ద్వారా డిజిటల్ బీమా పాలసీలను జారీ చేయ‌నున్న‌ట్లు బీమా రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ప్రకటించింది.

డిజిలాకర్, పేరు సూచించినట్లుగానే అన్ని పత్రాల కాపీలను తమ మొబైల్ ఫోన్లలో  భద్రపరచడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. డిజిటల్ లాకర్ యాప్‌ను  గూగుల్ / ఆపిల్ ప్లే / యాప్ స్టోర్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం, డ్రైవింగ్ లైసెన్స్, కార్ రిజిస్ట్రేషన్, ఓటరు ఐడి, పాన్ కార్డ్, పాఠశాల,  స‌ర్టిఫికెట్స్, ప్రభుత్వం జారీ చేసిన అనేక ఇతర పత్రాలను డిజిటల్‌గా సేవ్ చేయవచ్చు. పత్రాలు డిజిలాకర్ ద్వారా డిజిటల్ రూపంలో ఉన్న‌ప్ప‌టికీ ధృవీకరణ కోసం వీటిని గుర్తింపుగా ప‌త్రాలుగా అంగీక‌రిస్తారు.

డిజిలాక‌ర్‌ అనేది భారత ప్రభుత్వం డిజిటల్ ఇండియా కింద చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చారు. డిజిలాక‌ర్ భౌతిక పత్రాల వాడకాన్ని తొలగించడం లేదా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఇది పాల‌సీదారుల‌కు సుల‌భ‌మైన ప్ర‌క్రియ‌గా మారుతుంది.

లాభాలు:
 డిజిలాక‌ర్‌ పాలసీ పత్రాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో నిల్వ చేయడంలో సహాయపడటమే కాకుండా ఖర్చులను తగ్గించడం, పాలసీ కాపీని పాల‌సీదారునికి నేరుగా అందించాల్సిన అవ‌స‌రం లేక‌పోవ‌డం,  వేగంగా క్లెయిమ్ ప్రాసెసింగ్, పరిష్కారం, పాల‌సీ కాపీ అంద‌లేద‌నే వినియోగ‌దారు ఫిర్యాదులను త‌గ్గించ‌డానికి దోహ‌దం చేస్తుంది.  దీంతో మోసాలు కూడా త‌గ్గుతాయి.  ప‌నులు త్వ‌ర‌గా పూర్తి కావ‌డంతో పాటు సుల‌భ‌మైన సదుపాయాన్ని పొంద‌వ‌చ్చు.  

బీమా రంగంలో డిజిలాక‌ర్‌ స్వీకరణను ప్రోత్సహించడానికి, పాలసీ పత్రాలను సంరక్షించడానికి పాలసీదారులకు ఉపయోగించుకునే సదుపాయంతో వారి ఐటి వ్యవస్థలను అనుసందానం చేయాల‌ని ఐఆర్‌డీఏఐ అన్ని బీమా సంస్థలకు సూచించింది.

బీమా సంస్థలు తమ రిటైల్ పాలసీదారులకు డిజిలాకర్ గురించి, దానిని ఎలా ఉపయోగించాలో తెలియజేయాలి. పాలసీదారులు తమ పాలసీలను డిజిలాకర్‌లో ఉంచే ప్రక్రియను ప్రారంభించేలా బీమా సంస్థ‌లు ప్రోత్స‌హించాల‌ని తెల‌తిపింది.
ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని  నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌లోని డిజిలాకర్ బృందం దీనిని స్వీకరించడానికి అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, లాజిస్టిక్ మద్దతును అందిస్తుంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని