మానసిక అనారోగ్యానికీ పరిహారం ఇవ్వాల్సిందే - Insurers must pay compensation even for Mental health issues
close

Updated : 25/04/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మానసిక అనారోగ్యానికీ పరిహారం ఇవ్వాల్సిందే

బీమా సంస్థలకు స్పష్టం చేసిన దిల్లీ హైకోర్టు

దిల్లీ: మానసిక అనారోగ్య చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత బీమా సంస్థలకు ఉంటుందని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. 2018 నుంచి అమల్లోకి వచ్చిన మెంటల్‌ హెల్త్‌కేర్‌ చట్టం 2017 ప్రకారం బీమా సంస్థలు ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేవని చెప్పింది. పరిహారాన్ని నిరాకరించడం చట్ట లక్ష్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొంది. బీమా సంస్థలు చట్ట ప్రకారం నడుచుకుంటున్నాయా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత ఐఆర్‌డీఏదేనని పేర్కొంది. ఒకవేళ నియంత్రణ సంస్థ పట్టించుకోకపోతే.. చట్ట ప్రకారం దానిపైనా చర్య తీసుకునేందుకు వీలుందని తెలిపింది. స్కిజోఫ్రినియా చికిత్సకు సంబంధించి నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ పరిహారం ఇవ్వడానికి నిరాకరించడంతో ఒక మహిళ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ ప్రతిభా ఎం సింగ్‌ తీర్పును వెల్లడిస్తూ.. ఐఆర్‌డీఏ బీమా సంస్థలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని అర్థం అవుతోందన్నారు. మహిళకు రూ.6.67 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా బీమా సంస్థను ఆదేశించడంతోపాటు, మరో రూ.25,000 అదనంగా చెల్లించాలని తీర్పిచ్చారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని