close

తాజా వార్తలు

దేశాభివృద్ధిలో ఏయూ కీలకపాత్ర పోషిస్తుంది

టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ

విశాఖ: యువత కలలు సాకారం చేసుకునే దిశగా వెళ్తే గొప్ప విజయాలు సాధిస్తారని దిగ్గర సంస్థ టెక్‌ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ అన్నారు. ఆంధ్రా విశ్వ కళా పరిషత్‌ను  సందర్శించిన ఆయన ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని సీఎమ్‌ఎస్‌ ఎక్స్‌లెన్స్‌  కేంద్రాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులు  తమ పిల్లలను ఇంజినీరింగ్‌లో  చేర్చే ముందు  కళాశాలలో విద్యానాణ్యతను పరిగణలోకి తీసుకోవాలంటున్న గుర్నానీతో  ఈటీవీ నిర్వహించిన ముఖాముఖి..

ప్రశ్న : ఆంధ్రా యూనివర్సిటీని సందర్శించడం మీకెలాంటి అనుభూతి కలిగించింది?

జ: ప్రపంచంలో అతిపురాతనమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఏయూకు సమర్థుడైన వ్యక్తి ఉపసంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు.  విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రొఫెసర్లు, విభాగాధిపతులు అంకితభావంతో పనిచేస్తున్నారు. కేవలం సాంకేతికపరరమైన విషయాలతో ఆగిపోకుండా.. వ్యాపార మెలకువలు, ఉత్పత్తులు వంటి విషయాలను చర్చిస్తున్నారు. నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయడం  ద్వారా దేశాభివృద్ధిలో ఏయూ కీలకపాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతుంది.

ప్రశ్న : వర్సిటీ కీర్తిప్రతిష్టల పెరుగుదలకకు ఆలుమ్ని సదస్సులు ఏ విధంగా దోహదపడతాయి?

జ: ఆలుమ్నికి పరిశ్రమలో ఉన్న అనుభవం, సంబంధాలతో వర్సిటీలు, పరిశ్రమలకు వారధిలా ఉపయోగపడతారు. ఎందుకంటే విద్యార్థి జీవితం తర్వాత వారు ఎన్నో సాధకబాధకాలు చూసి ఉంటారు. ఇప్పుడు ఏయూలోని 65 విభాగాల పూర్వ విద్యార్థులు కలిసిరావడం ప్రత్యేకమైనది. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరిగి ఉండదు.

ప్రశ్న : ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాలనుకుంటున్న యువ వ్యాపారవేత్తలకు టెక్‌ మహేంద్ర సీఈవోగా మీరిచ్చేసలహా ?

జ: లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణాన్ని అదుపులో ఉంచుకుని కష్టపడితే ఏదైనా సాధించగలరు. కలలను సాకారం చేసుకునే సామర్థ్యం ఉన్నవారు లక్ష్యాన్ని చేరుకుంటారు. లక్ష్యంపై అంకితభావం ఉన్నవారికీ, లేనివారికీ అదే తేడా.  

ప్రశ్న : ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ చాలా మంది నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు కారణమేంటీ?

జ: ఒక చొక్కా కొనాలంటే మంచి రేటింగ్‌ ఉన్న సంస్థ, దుకాణానికి వెళ్తాం. ఏదైనా హోటల్‌లో ఆహారం తినాలన్నా రేటింగ్‌ చూస్తాం.  అదేవిధంగా  తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలల్లో చేర్చే ముందు ఇదే రీతిలో ఆలోచించాలి.  మంచి రేటంగ్‌ ఉన్న కళాశాలల్లో చేర్పిస్తే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.