ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలా? - Investing-in-Nifty-or-Sensex-Index-fund
close

Updated : 13/03/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలా?

2013 లో బెర్క్‌షైర్ షేర్‌హోల్డ‌ర్ల‌కు రాసిన  లేఖలో‌ ఇండెక్స్ ఫండ్లు ఉత్తమ పెట్టుబడి సాధనాలు అని వారెన్ బఫెట్ పేర్కొన్నారు. వీలునామాలో తాను పెట్టిన సూచనల గురించి మాట్లాడుతూ, ట్రస్టీకి నా సలహా ఏంటంటే..10 శాతం నగదును స్వల్పకాలిక ప్రభుత్వ బాండ్లలో , 90 శాతం చాలా తక్కువ ఖర్చుతో ఎస్ & పి 500 ఇండెక్స్ ఫండ్‌లో పెట్టాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. ఈ విధానం నుంచి ట్రస్ట్ దీర్ఘకాలిక ఫలితాలు చాలా మంది పెట్టుబడిదారులు - పెన్షన్ ఫండ్లు, సంస్థలు లేదా వ్యక్తులు - అధిక ఫీజు నిర్వాహకులను నియమించిన వాటి కంటే ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను అని బ‌ఫెట్‌ అన్నారు.

భారతదేశంలో చాలా మంది పెట్టుబడి సలహాదారులు ఖాతాదారులను తమ ప్రధాన పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఇండెక్స్ ఫండ్‌లు చేయమని అడుగుతున్నారు. దేశంలో, ఎస్ & పి బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 అనే రెండు ప్రముఖ సూచికలు ఉన్నాయి. సెన్సెక్స్‌లో  30 స్టాక్స్ ఉండగా, రెండోది 50 కలిగి ఉంది. మీరు ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాల‌నుకుంటే ఏది ఎంచుకోవాలి

పెట్టుబడి సలహాదారుల ప్రకారం, ఈ  రెండు సూచికలు ఒకే విధమైన చారిత్రక రాబడిని కలిగి ఉన్నాయి. అవి రెండూ అతిపెద్ద భారతీయ కంపెనీల  సగటు విలువ‌ను సూచిస్తాయి, ఇందులో టాప్ 20 కంపెనీలకు ఎక్కువ విలువ‌ ఉంటుంది. మిగిలినవి చిన్నవి.

ఇంకా సుల‌భంగా చెప్పాలంటే , మీరు ఇండెక్స్ ఫండ్ ద్వారా ఇండెక్స్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు, ప్రతి కంపెనీ విలువ‌ ఆధారంగా పెట్టుబడులు పెట్టబడతాయి. ఉదాహరణకు, పెట్టుబడిదారుడు రూ.100 ను ఇండెక్స్ ఫండ్‌లో పెడితే.. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కే 23-24 శాతం, ఫండ్ మేనేజ‌ర్ కేటాయిస్తారు. ఈ ఇండెక్స్‌ల‌లోని ఈ 30-50 స్టాక్స్  వైవిధ్యీకరణకు సరిపోతాయ‌ని స‌ల‌హాదారులు చెప్తున్నారు. 

ఇండెక్స్ ఫండ్‌ను ఎన్నుకునేటప్పుడు, మీరు అధిక ఆస్తుల నిర్వహణ (ఏయూఎం) ఉన్న ఫండ్‌కి వెళ్లండి. ఫండ్‌పై ఉప‌సంహ‌ర‌ణ‌ ఒత్తిడి ఉన్న‌ప్పుడు అధిక ఏయూఎం ఉంటే మంచిది. అదేవిధంగా మీరు ఎంచుకున్న ఫండ్ తక్కువ ఖర్చు నిష్పత్తిని కలిగి ఉండాలి.

ఫండ్, ఇండెక్స్ రాబడి మధ్య వ్యత్యాసాన్ని ట్రాకింగ్ లోపం అంటారు. ఇది తక్కువ ఉంటే మంచిది. అయితే, 1 శాతం వరకు ట్రాకింగ్ లోపం సాధారణంగా ఆమోదయోగ్యమైనది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని