బఫెట్‌ వారసుడు గ్రెగ్‌ అబెల్‌! - Investor Warren Buffett names Berkshire Hathaway successor
close

Published : 04/05/2021 11:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బఫెట్‌ వారసుడు గ్రెగ్‌ అబెల్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ కుబేరుడు, బెర్క్‌షైర్‌హాత్‌వే అధిపతి అయిన వారెన్‌ బఫెట్‌ వయసు ఇపుడు 90 ఏళ్లు. ఆయన తర్వాత కంపెనీకి ఎవరు చూసుకుంటారన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. ఒక వేళ ఆ స్థానం నుంచి తప్పుకుంటే బెర్క్‌షైర్‌ హాత్‌వే వైస్‌ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ అబెల్‌ తన వారసుడిగా కొనసాగుతారని బఫెట్‌ ఇటీవల పేర్కొన్నారు. తన స్థానాన్ని అబెల్‌(58)తో భర్తీ చేయడానికి బోర్డు అంగీకరించిందని బఫెట్‌ సైతం ఒక ఆంగ్ల ఛానల్‌కు తెలిపారు. చాలా కాలం నుంచి వారసుడి పేర్లలో అబెల్‌ పేరు నానుతోంది. అయితే వారసత్వ నిర్ణయాలను ఈ కంపెనీ చాలా రహస్యంగా ఉంచుతుంది. తమ వద్ద ఇందుకు సంబంధించి సవివరణ ప్రణాళిక ఉందని మదుపర్లకు సైతం గతంలోనే చెప్పింది. మరో వైస్‌ ఛైర్మన్‌ అజిత్‌ జైన్‌(69)ను సైతం ఇందుకు పరిశీలించినా.. వయసు కీలకంగా మారుతోందని బఫెట్‌ వివరించారు. వారిద్దరూ అద్భుత వ్యక్తులని యాభైఏళ్ల పాటు వారిని గమనిస్తూ వచ్చిన బఫెట్‌ ఈ సందర్భంగా అన్నారు. బెర్క్‌షైర్‌ వైస్‌ ఛైర్మన్‌ చార్లీ ముంగర్‌(97) సైతం శనివారం నాటి వార్షిక సమావేశంలో గ్రెగ్‌ గురించి ప్రస్తావించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని