close

Published : 12/04/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిమిషాల్లో రూ. 6.86లక్షల కోట్ల సంపద ఆవిరి

దిల్లీ: కరోనా రెండో దశ ఉద్ధృతి, లాక్‌డౌన్‌ భయాలతో దేశీయ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌  సెన్సెక్స్‌ ఏకంగా 1500 పాయింట్లు పతనమవగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ కూడా 14,500 దిగువకు పడిపోయింది. సూచీల నష్టాలతో కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ. 6.86లక్షల కోట్ల మేరకు ఆవిరైంది. ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 1479.15 పాయింట్లు కోల్పోయింది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6,86,708.74కోట్లు తగ్గి రూ. 2,02,76,533.13కోట్లకు చేరింది.

ప్రస్తుతం సూచీలు మరింత దిగజారాయి. ఉదయం 11.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1532 పాయింట్లు పతనమై 48,058 వద్ద, నిఫ్టీ 461 పాయింట్ల నష్టంతో 14,373 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో మదుపర్ల సంపద మరింత కరగనుంది. 
అత్యధికంగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 7శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. ఎస్‌బీఐ, బజాజ్ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు కూడా కుంగాయి.  

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కరోనా ఆంక్షలను కఠినతరం చేయడంతో వ్యాపారాలపై మళ్లీ ప్రభావం చూపిస్తుందనే భయాలు నెలకొన్నాయి. మరోవైపు ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి సూచి, మార్చి నెల సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సోమవారమే వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారు.  

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని