ఆరోగ్య బీమా క్లెయిమ్‌ తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి - Irdai asks insures to be more transparent in health insurance claims settlement specify reasons of denial
close

Published : 22/03/2021 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరోగ్య బీమా క్లెయిమ్‌ తిరస్కరిస్తే కారణాలు చెప్పాలి

ఐఆర్‌డీఏఐ

దిల్లీ: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిష్కారంలో బీమా సంస్థలు మరింత పారదర్శకంగా వ్యవహరించాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సూచించింది. ఒకవేళ క్లెయిమ్‌లను తిరస్కస్తే అందుకు తగిన కారణాలను పాలసీదార్లకు తెలియజేయాలని కోరింది. అన్ని బీమా సంస్థలూ, క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియలో వివిధ దశల్లో సదరు పాలసీదార్లకు స్పష్టమైన, పారదర్శక సమాచారాన్ని అందించాలని సర్క్యులర్‌ జారీ చేసింది. పాలసీదార్లు నగదు రహిత అభ్యర్థనలు/క్లెయిమ్‌ల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఆయా బీమా సంస్థలు/టీపీఏలు తమ వెబ్‌సైట్‌/పోర్టల్‌/యాప్‌ ద్వారా సమాచారం అందుబాటులో ఉంచే వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. క్లెయిమ్‌ అభ్యర్థన మొదలుకుని, అది పూర్తిగా పరిష్కారమయ్యే వరకు వివిధ దశల్లో ఏం జరుగుతుందనేది పాలసీదారులు తెలుసుకునే వీలు కల్పించాలని పేర్కొంది. ఈ సూచనలు ప్రభుత్వరంగ బీమా సంస్థలైన ఏఐసీ, ఈసీజీసీలకు వర్తించవని తెలిపింది.

ఇవీ చదవండి..

అప్పుల ఊబిలో కుటుంబాలు

బంగాళాదుంపలు కిలో రూ.5-6


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని