భారత్‌లో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ తొలి విద్యుత్తు కారు! - JLR drives in all electric SUV in India
close

Published : 23/03/2021 17:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ తొలి విద్యుత్తు కారు!

దిల్లీ: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) భారత్‌లో తొలి విద్యుత్తు కారును విడుదల చేసింది. ఎస్‌యూవీ జాగ్వార్‌ ఐ-పేస్‌ను పూర్తిస్థాయి విద్యుత్తు కారుగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంట్లో 90 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది 294 కేవీ శక్తిని, 696 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. కేవలం 4.8 సెకన్లలోనే  100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంది. ప్రతి దశలో వాహనదారుడికి అద్భుతమైన అనుభూతిని అందించేలా, సులువుగా ఆపరేట్‌ చేయగలిగేలా ఎలక్ట్రిక్‌ ఐ-పేస్‌ను రూపొందించామని జాగ్వార్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

దేశవ్యాప్తంగా 19 నగరాల్లో ఉన్న 22 జేఎల్‌ఆర్‌ రిటైల్‌ ఔట్‌లెట్లలో 35 ఈవీ ఛార్జర్లను అమర్చామని సంస్థ తెలిపింది. ప్రతిచోట 7.4 కేడబ్ల్యూ ఏసీతో పాటు 25 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్లను అందుబాటులో ఉంచామని పేర్కొంది. అలాగే రిటైల్‌ సిబ్బందికి ఛార్జింగ్‌ విధానంపై పూర్తిస్థాయి శిక్షణనిచ్చామని తెలిపింది. తద్వారా వినియోగదారులకు కలిగే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పింది. 

ఐ-పేస్‌ ఎలక్ట్రిక్‌ కారును వినియోగదారులు ఇళ్లల్లోనూ ఛార్జ్‌ చేయొచ్చని జేఎల్‌ఆర్‌ తెలిపింది. దీని కోసం స్టాండర్డ్‌ ఛార్జింగ్‌ కేబుల్‌ వాహనంతో పాటే వస్తుందని పేర్కొంది. లేదా కంపెనీ ఇచ్చే 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్‌ మౌంటెడ్‌ ఛార్జర్‌ని కూడా వాడుకోవచ్చంది. ఇది కూడా కారుతో పాటే వస్తుందని తెలిపింది. ఛార్జర్‌ని అమర్చడానికి టాటా పవర్‌ లిమిటెడ్‌ సిబ్బంది సహకరిస్తారని చెప్పింది. ఈ కారు కొనుగోలు చేస్తే ఐదేళ్ల సర్వీస్‌ ప్యాకేజీ, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్‌ ప్యాకేజీ, ఎనిమిదేళ్ల లేదా 1.6 లక్షల కి.మీ వరకు బ్యాటరీ గ్యారంటీ వంటి అదనపు ప్రయోజనాలు అందిస్తామని తెలిపింది. ఈ కారులో ‘సాఫ్ట్‌వేర్‌ ఓవర్‌ ది ఎయిర్‌(ఎస్‌ఓటీఏ)’ వ్యవస్థను పొందుపరిచినట్లు పేర్కొంది. దీంతో బ్యాటరీ మేనేజ్‌మెంట్‌, ఛార్జింగ్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థలను రిమోట్‌తో నియంత్రించవచ్చని తెలిపింది.

ఇవీ చదవండి...

ఏప్రిల్‌ నుంచి ధరలు పెంచనున్న నిస్సాన్‌

ఆడి ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ @ రూ.79 లక్షలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని