Jawa: లాక్‌డౌన్‌లు తొలగించగానే డెలివరీలు - Jawa Dealerships To Be Extended To 500
close

Published : 01/06/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jawa: లాక్‌డౌన్‌లు తొలగించగానే డెలివరీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: మహీంద్రాకు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్ సంస్థ త్వరలో జావా డీలర్‌షిప్‌లను విస్తరించనుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించగానే దీనికి సంబంధించిన పనిని మొదలుపెట్టనుంది. కఠిన పరిస్థితులు ఎదురైనా.. కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని క్లాసిక్‌ లెజెండ్స్‌ పేర్కొంది. ఇప్పటికే బుకింగ్స్‌ చేసుకొన్న వినియోగదారులకు డెలివరీల్లో ఆలస్యం కాకుండా ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. ఒక్కసారి రాష్ట్రాల వారీగా లాక్‌డౌన్లను తొలగించగానే బుకింగ్‌ చేసుకొన్న వారికి అత్యంత వేగంగా వాహనాలను సరఫరా చేస్తామని తెలిపింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జావా 42 స్పోర్ట్స్‌ స్ట్రిప్‌ మోడల్‌ను విడుదల చేసింది. దీనిలో అలాయ్‌వీల్స్‌, చిన్నచిన్న కాస్మోటిక్‌ మార్పులు చేసింది. ‘‘42 స్పోర్ట్స్‌ స్ట్రిప్‌ వాహనానికి  మంచి డిమాండ్‌ ఉంది. వీటిల్లో కూడా ఆల్‌ స్టార్‌ బ్లాక్‌ అత్యధిక ఆదరణ పొందుతోంది.  బుకింగ్స్‌లో 50శాతం దీని కోసం వచ్చినవే  ఉన్నాయి. మిగిలిన రెండు రంగులు 50 శాతం ఉన్నాయి’’ అని క్లాసిక్‌ లెజెండ్స్ సీఈవో ఆశీష్‌ సింగ్‌ జోషీ పేర్కొన్నారు.

జావా మోటార్‌ సైకిల్స్‌కు దేశ వ్యాప్తంగా 150 పట్టణాల్లో  ఆగస్టు నాటికి 175 డీలర్లు ఉండనున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. ఆ తర్వాత ఈ సంఖ్యను 275కు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. ఇక వచ్చే 12 నెలల్లో మొత్తం 500 డీలర్‌ షిప్‌లు ఉండేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని