ఐటీఆర్ ఫైలింగ్ కోసం 'ఝట్‌పట్ ప్రాసెసింగ్' ను ప్రారంభించిన ఆదాయపు పన్ను శాఖ.. - Jhatpat-processing-feature-introduced-by-income-tax-department
close

Updated : 27/12/2020 12:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీఆర్ ఫైలింగ్ కోసం 'ఝట్‌పట్ ప్రాసెసింగ్' ను ప్రారంభించిన ఆదాయపు పన్ను శాఖ..

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను దాఖలు చేసే చివరి తేదీ సమీపిస్తున్న తరుణంలో, పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆదాయపు శాఖ 'ఝట్‌పట్ ప్రాసెసింగ్' అనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. పన్ను చెల్లింపుదారులు రిటర్న్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన దాఖలు చేయడంలో  ‘ఝట్‌పట్ ప్రాసెసింగ్’ ఫీచర్ సహాయపడుతుంది. ఐటీఆర్ 1, ఐటీఆర్  4 కోసం 'ఝట్‌పట్ ప్రాసెసింగ్' ప్రారంభమైంది. 'ఝట్‌పట్ ప్రాసెసింగ్' ద్వారా ఐటీఆర్ 1, ఐటీఆర్ 4 ని ఎలా దాఖలు చేయాలో వివరించే ట్యుటోరియల్ వీడియోను ఆదాయపు పన్ను శాఖ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. 

ఆదాయపు పన్ను విభాగం నిర్దేశించిన ఈ కింది ప్రమాణాలను నెరవేర్చిన వారు మాత్రమే దీనిని యాక్సెస్ చేయవచ్చు:

> ఐటీఆర్ ధృవీకరించడం
> బ్యాంక్ ఖాతా ముందే ధృవీకరించడం
> బకాయిలు లేకపోవడం
> ఆదాయ వ్యత్యాసం లేకపోవడం
> టీడీఎస్ లేదా చలాన్ అసమతుల్యత లేకపోవడం

సాధారణంగా పన్ను చెల్లింపుదారులు జూలై 31 లోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, కోవిడ్ -19 ప్యాండమిక్ కారణంగా ఐటీఆర్ దాఖలు గడువును పొడిగించడం జరిగింది. ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2020 కాగా, ఆడిట్ అవసరమయ్యే పన్ను చెల్లింపుదారులకు చివరి తేదీ జనవరి 31, 2021 గా ఉంది. 

డిసెంబర్ 24, 2020 వరకు 3.97 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను అసెస్‌మెంట్ ఇయర్ (ఏవై) 2020-21 (2019-20 ఆర్థిక సంవత్సరం)  దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం తెలిపింది. ఒకవేళ మీరు ఇంకా రిటర్న్స్ దాఖలు చేయకపోతే, త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయండని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని