close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 14:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ రీఛార్జ్‌ ప్లాన్‌ను ఆపేసిన జియో

ఇంటర్నెట్‌డెస్క్‌: అతి తక్కువ ధరకు డేటాను అందరికీ అందుబాటులోకి తెచ్చిన సంస్థ జియో. గత కొంతకాలంగా వివిధ రీఛార్జ్‌లపై ధరలను పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జియో నెట్‌వర్క్‌లోని అతి తక్కువ ప్లాన్‌ రూ.98 ఒకటి. ఇప్పుడు దీని ధరను పెంచి రూ.129గా నిర్ణయించింది. దీంతో జియో అందించే ఆఫర్లలో ఇదే అతి తక్కువ ప్లాన్‌.

రూ.129తో రీఛార్జ్‌ చేసుకుంటే 2 జీబీ డేటా, జియో-టు-జియో అపరిమిత కాల్స్‌, రోజుకు 300 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. దీని కాల పరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్‌ మాట్లాడాలంటే ఈ ప్లాన్‌తో పాటు అదనంగా టాప్‌ అప్‌ ఓచర్‌ను తీసుకోవాలి.

జియో ఇటీవలే మరో ప్లాన్‌ను కూడా తీసుకొచ్చింది. ముఖ్యంగా కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేసే వారి సంఖ్య పెరగడంతో అలాంటి వారు రూ.999తో రీఛార్జ్‌ చేసుకుంటే 84రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను పొందవచ్చు. ఈ రీఛార్జ్‌తో ఇతర నెట్‌వర్క్‌లకు 3వేల కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకోవచ్చు. దీంతో పాటు రూ.599, రూ.399 ప్లాన్‌లు కూడా ఉన్నాయి. వీటితో రోజుకు వరుసగా 2జీబీ, 1.5జీబీ డేటాను పొందవచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.