close
Array ( ) 1

తాజా వార్తలు

జియో: 100 నిమిషాలు 100 SMSలు ఉచితం

దిల్లీ: వినియోగదారులకు ఏప్రిల్‌ 17 వరకు 100 నిమిషాల టాక్‌టైమ్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా ఇస్తున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మహమ్మారి కొవిడ్‌-19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. చాలాచోట్ల దుకాణాలు తెరవకపోవడంతో రీఛార్జి చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో జియో వినియోగదారులందరికీ ఈ ఆఫర్‌ను వర్తింప చేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రీఛార్జి చేయకున్నా లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించింది.

‘ఈ అత్యవసర సమయంలో జియో ఫోన్‌ వినియోగదారులందరికీ 10 రెట్ల ప్రయోజనాలు. 100 నిమిషాల కాల్స్‌, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా అందజేస్తున్నాం’ అని జియో ట్వీట్‌ చేసింది. టెలికాం సంస్థలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల దుకాణాలు తెరిచే అవకాశం లేదని ట్రాయ్‌ తెలిపింది. వినియోగదారులందరూ ఆన్‌లైన్‌లో రీఛార్జి చేసుకోలేరు కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల గడువును పెంచాలని టెలికాం ఆపరేటర్లను కోరింది.

ట్రాయ్‌ సూచన మేరకు సోమవారం ఎయిర్‌టెల్‌ తమ 8 కోట్ల వినియోగదారులకు కాలపరిమితిని ఏప్రిల్‌ 17 వరకూ పొడిగించింది. పది రూపాయాల టాక్‌టైమ్‌ను జత చేసింది. వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ సైతం ఇదే ఆఫర్‌ను ప్రకటించినా కేవలం పేద వర్గాలకు మాత్రమే ఇస్తామని తెలిపింది.

చదవండి: చైనా.. అంతమంది చనిపోతే అబద్ధాలు చెబుతావా?

చదవండి: ఈఎంఐ వాయిదాలకు బ్యాంకుల ఆమోదం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.