చిన్న తరహా పరిశ్రమలకు జియో ఆఫర్‌ - Jio to offer services at lower tariffs for MSMBs
close

Published : 09/03/2021 22:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్న తరహా పరిశ్రమలకు జియో ఆఫర్‌

దిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంబీ) ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ఆఫర్‌ ప్రకటించింది. తక్కువ ధరకే వీరికి బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించనున్నట్లు తెలిపింది. మార్కెట్‌ ధరతో పోలిస్తే పదో వంతు ధరకే ఈ సేవలను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు 100 ఎంబీపీఎస్‌ వేగంతో బ్రాండ్‌బ్యాండ్‌ సేవలను ₹901కే అందిస్తున్నట్లు ప్రకటించింది.

కనెక్టివిటీ, ఆటోమేషన్‌ టూల్స్‌ వంటి వాటికోసం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నెలకు రూ.15వేల నుంచి 20 వేల ఖర్చు చేస్తున్నాయని,  తాము పదో వంతు ధరకే బ్రాండ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తామని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు. రిమోట్‌ ఎంప్లాయి మేనేజ్‌మెంట్‌, వీడియో కాన్ఫరెన్సింగ్‌ సదుపాయాలు అందించే డిజిటల్‌ సొల్యూషన్స్‌ను కేవలం ₹5వేల అద్దెకే అందించనున్నామని చెప్పారు. పోటీ సంస్థలతో పోలిస్తే 50 శాతం తక్కువ ధరకే వీటిని అందిస్తున్నామని తెలిపారు. 5 కోట్ల ఎంఎస్‌ఎంబీ వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీపీఎస్‌ వరకు వేగం కలిగిన ₹901 నుంచి ₹10,001 వరకు ఉన్న వివిధ రకాల ప్లాన్లను ఆవిష్కరించారు.

ఇవీ చదవండి..

ఓటీపీకి అవాంతరాలు.. ట్రాయ్‌ కీలక నిర్ణయం

త్వరలో భారత్‌లోకి వోల్వో విద్యుత్‌ కారు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని