స్పేస్‌ఎక్స్‌కు నాసా కీలక కాంట్రాక్టు - Key contract has been given to spapcex by NASA
close

Published : 17/04/2021 16:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్పేస్‌ఎక్స్‌కు నాసా కీలక కాంట్రాక్టు

వాషింగ్టన్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కీలక కాంట్రాక్టు అప్పగించింది. దీని విలువ 2.9 బిలియన్‌ డాలర్లు. 2024 నాటికి చంద్రుడిపైకి మానవసహిత యాత్రకు కావాల్సిన ల్యాండర్‌ను స్పేస్‌ఎక్స్‌ రూపొందించాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అమెజాన్‌ సహవ్యవస్థాకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్‌, డైనెటిక్స్‌ కూడా పోటీ పడగా.. నాసా స్పేస్‌ఎక్స్‌ వైపే మొగ్గుచూపింది.

స్టార్‌షిప్‌ పేరిట రూపొందించనున్న ఈ ల్యాండర్‌లో ఓ క్యాబిన్‌తో పాటు మూన్‌వాక్‌కు కావాల్సిన రెండు ఎయిర్‌లాక్‌లు ఉంటాయి. దీన్ని పునర్‌వినియోగ ల్యాండర్‌గా రూపొందించాలనుకుంటున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహంపైకి జరపబోయే మానవ సహిత యాత్రలకు కూడా దీన్ని ఉపయోగించాలని భావిస్తున్నారు.

ఆర్టెమిస్‌ పేరిట నాసా చేపడతున్న ఈ ప్రాజెక్టులో ఒరియాన్‌ అనే స్పేస్‌క్రాఫ్ట్‌లో మొత్తం నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళతారు. వీరిలో ఇద్దరు స్పేస్‌ఎక్స్‌ హ్యూమన్‌ ల్యాండింగ్‌ సిస్టం ద్వారా చంద్రుడిపై కాలు మోపుతారు. దాదాపు వారం రోజుల పాటు వారు అక్కడే గడుపుతారు. అనంతరం చంద్రుడి కక్ష్యలో ఉండే ఒరియాన్‌కు తిరిగొస్తారు. అప్పటి వరకు కక్ష్యలో ఉండే ఇతర ఇద్దరు వ్యోమగాములతో కలిసి తిరిగి భూమికి పయనమవుతారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని