Business news: బుల్‌ దూకుడు.. స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు కారణాలివే.. - Key factors driving the stock market rally
close

Updated : 22/07/2021 15:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Business news: బుల్‌ దూకుడు.. స్టాక్‌ మార్కెట్‌ లాభాలకు కారణాలివే..

ఇంటర్నెట్‌డెస్క్‌: గురువారం మధ్యాహ్నం కూడా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల ర్యాలీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2.18 సమయానికి నిఫ్టీ 157 పాయింట్లు లాభపడి 15,791 వద్ద కొనసాతుండగా.. సెన్సెక్స్‌ 537 పాయింట్లు లాభపడి 52,736కు చేరింది. జిందాల్‌ స్టీల్‌, జిందాల్‌ స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌, ఐడీఎఫ్‌సీ, జుబ్లియంట్‌ ఫుడ్‌ వర్క్స్‌, మాస్టెక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి.. వెంకీస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ పవర్‌, పాలీక్యాబ్‌ ఇండియా, ఫ్యూచర్‌ సప్లై ఛైన్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లోహ, బ్యాంక్‌, ఫైనాన్షియల్‌, రియాల్టీ రంగాల షేర్ల కౌంటర్లలో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. నిఫ్టీలోని బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందాల్కో, టాటాస్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌,టెక్‌ మహీంద్రా వంటి షేర్లు దూకుడుగా ఉన్నాయి.

అమెరికాలో డెల్టా వేరియంట్‌ భయాలతో కొన్నాళ్లగా షేర్ల విక్రయాలు జరుగుతున్నాయి.. కానీ, నిన్న అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఆంటోనీ ఫౌచీ వ్యాక్సిన్లు పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. దీంతో మళ్లీ అక్కడి మార్కెట్లు పుంజుకొన్నాయి.. ఆ ప్రభావం దేశీయ సూచీలపై కూడా పడింది. 

* కరెన్సీ మార్కెట్లు అప్రమత్తంగా ఉండటం దేశీయ సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌ ట్రేడింగ్‌ అప్రమత్తంగా ఉంది. మూడు నెలల క్రితం డాలర్‌ సూచీ 93.194 ఉండగా.. ఇప్పుడు అది 92.812కు తగ్గింది. 

* కార్పొరేట్‌ ఫలితాలను సానుకూలంగా ఉండటంతో బాండ్‌ ఈల్డ్‌లు తాత్కాలికంగా పెరిగాయి. ఇది ఇన్వెస్టర్లను మార్కెట్ల వైపు ఆకర్షించేలా చేస్తోంది. 

* మార్కెట్లో కీలక సూచీలు సానుకూలంగా ట్రేడ్‌ అవ్వడం కలిసొస్తోంది. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ 1.19శాతం , మిడ్‌ క్యాప్‌ 0.75శాతం పెరగడం కూడా సూచీలకు బలాన్ని ఇచ్చింది. 

* అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. వాల్‌స్ట్రీట్‌ ర్యాలీ ప్రభావంతో జపాన్‌ మార్కెట్‌ పుంజుకొంది. సిడ్ని, సియోల్‌, హాంకాంగ్‌ మార్కెట్‌ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడవుతున్నాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని