close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విపణిలోకి ఖాదీ పాదరక్షలు

దిల్లీ: ఖాదీ వస్త్రంతో తయారు చేసిన పాదరక్షల (ఫ్యాబ్రిక్‌ ఫుట్‌వేర్‌)ను ఖాదీ అండ్‌ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కేవీఐసీ) బుధవారం విపణిలోకి విడుదల చేసింది. రూ.50,000 కోట్ల విలువైన భారతీయ పాదరక్షల మార్కెట్‌లో 2 శాతం మార్కెట్‌ వాటా దక్కించుకునే లక్ష్యంతో ఉన్నామని కేవీఐసీ వెల్లడించింది. దృశ్య మాధ్యమం (వీడియో కాన్ఫరెన్స్‌) ద్వారా కేంద్ర ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ శాఖ (సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు) మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ పాదరక్షల్ని విడుదల చేశారు. ఒక జత షూలు, చెప్పుల ధరలు రూ.1,100-3,300 మధ్య ఉంటాయని గడ్కరీ తెలిపారు. ప్రస్తుతానికి మహిళల పాదరక్షల్లో 15 డిజైన్లు ఉండగా, పురుషుల పాదరక్షల్లో 10 డిజైన్లు ఉన్నట్లు ఆయన వివరించారు. కేవీఐసీ ఇ-పోర్టల్‌ ద్వారా ఖాదీ పాదరక్షల ఆన్‌లైన్‌ సేల్స్‌ను కూడా మంత్రి బుధవారం ప్రారంభించారు. ‘అంతర్జాతీయ నాణ్యతతో పటోలా సిల్క్‌, బనారసి సిల్క్‌, కాటన్‌, డెనిమ్‌ వంటి ఫైన్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందుతున్న ఈ పాదరక్షలు యువతరానికి బాగా నచ్చుతాయ’ని నితిన్‌ గడ్కరీ వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.