Kia: కియా మోటార్స్‌ పేరు మారింది! - Kia officially changes name in India
close

Updated : 24/05/2021 22:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kia: కియా మోటార్స్‌ పేరు మారింది!

దిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్‌.. భారత్‌లో తన కంపెనీ పేరును మార్చింది. కియా మోటార్స్‌ను ఇకపై కియా ఇండియాగా మారుస్తున్నట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొత్త పేరు కంపెనీ బ్రాండ్‌కు మరింత గుర్తింపు తెచ్చి పెడుతుందని, దీర్ఘకాలంలో కంపెనీకి ఉన్నతికి తోడ్పడుతుందని పేర్కొంది.

కార్పొరేట్‌ మంత్రిత్వ శాఖ గుర్తించిన కియా మోటార్స్ స్థానంలో ఇకపై కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అనంతపురంలోని కంపెనీ తయారీ పరిశ్రమలో ఆ మేరకు లోగో, పేరులో మార్పులు చేసింది. డీలర్‌షిప్‌ కేంద్రాల వద్ద కూడా దశలవారీగా ఆ మేరకు మార్పులు చేయనున్నట్లు కియా తెలిపింది. ఏడాదిన్నరగా దేశంలో కార్ల విక్రయాలు చేపడుతున్న కియా.. అనతికాలంలోనే దేశంలో నాలుగో అతిపెద్ద కార్ల విక్రయదారుగా అవతరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని