ప్రీమియం వ‌సూళ్ల‌లో ఎల్ఐసీ రికార్డు.. - LIC-collects-highest-ever-premium-in-FY21
close

Updated : 22/04/2021 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రీమియం వ‌సూళ్ల‌లో ఎల్ఐసీ రికార్డు..

భారతదేశపు అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసి) కరోనా స‌మ‌యంలోనూ అత్య‌ధిక ప్రీమియంను వ‌సూలు చేసి, రికార్డు సృష్టించింది. గణాంకాల ప్రకారం.. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి అత్యధికంగా రూ. 1.84 లక్ష‌ల కోట్ల కొత్త బిజినెస్‌‌ ప్రీమియం వసూలు చేసింది.

లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం,  మార్చి 2021గానూ, మొద‌టి - ఏడాది ప్రీమియం చెల్లింపులు 64.7 శాతం పెరిగి రూ.28,105.92 కోట్లుకు చేరుకుంది. ఇది మార్చి2020లో రూ.17,066.57గా ఉంది.  2020-21 మొత్తం ఆర్ధిక సంవ‌త్స‌రంలో ప్రీమియంలు 3.5శాతం మేర పెరిగి రూ.1.84 ల‌క్ష‌ల కోట్ల‌ను చేరుకున్నాయి. 

ఎల్ఐసీ గ‌‌త ఏడాదిలో మొత్తం 2.10 కోట్ల పాల‌సీల‌ను విక్ర‌యించింది. వీటిలో 46.72 ల‌క్ష‌ల పాల‌సీలు మార్చి 2021లోనే విక్ర‌యించారు. అంటే గ‌త సంవ‌త్స‌రం మార్చి నెల‌తో పోలిస్తే, 298.82శాతం వృద్ధి సాధించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.18,137.34 కోట్లు విలువైన‌ 9.59 లక్షల మంది డెత్ క్లెయిమ్‌లను పరిష్కరించారు. మార్చి 2021 లో చెల్లించాల్సిన యాన్యుటీ చెల్లింపులు కూడా నిర్ణీత తేదీలలో పరిష్కరించడం జ‌రిగింది.

ఎల్‌ఐసీ ఈ ఏడాది మార్చిలో పాల‌సీల సంఖ్య‌లో 81.04 శాతం, 2020-21 మొత్తం ఆర్థిక సంవత్సరం 74.58 శాతం మార్కెట్‌ వాటా సాధించింది. ఇందులో మొద‌టి ఏడాది ప్రీమియం కోసం మార్కెట్ వాటా మార్చి నెల‌లో 64.74 శాతం, మొత్తం ఆర్థిక సంవ‌త్సరానికి 66.18 శాతంగా న‌మోద‌య్యాయి. 2020-21ఆర్ధిక సంవ‌త్స‌రంలో వ్యక్తిగత పాలసీదారుల వ్యాపారంలో అత్య‌ధిక వృద్ధిని సాధించింది. మొదటి ఏడాది ప్రీమియం ఆదాయం రూ.56,406 కోట్లు కాగా, ఇది అంతకు ముందు సంవత్సరంతో పోల్చినట్లయితే 10.11 శాతం ఎక్కువ.

పెన్షన్, గ్రూప్ సూపరేన్యుటేషన్‌లో, న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయంగా రూ.1.28 ల‌క్ష‌ల కోట్ల‌ను  వసూలు చేసింది, అంతకుముందు సంవత్సరంలో ఇది రూ. 1.27 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది.  కోవిడ్ -19 కారణంగా తీవ్రమైన అవరోధాలు ఉన్నప్పటికీ, ఎల్ఐసి రూ.1.16 ల‌క్ష‌ల కోట్లు విలువైన‌ 2.19 కోట్ల మెచ్యూరిటీ క్లెయిమ్‌లను ప‌రిష్క‌రించింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. కొత్త‌గా వ‌చ్చిన‌ 3,45,469 ఏజెంట్లతో పాటు, ఎల్ఐసి 13,53,808 ఏజెంట్లతో బలమైన సేల్స్ ఫోర్స్‌ను కలిగి ఉంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని