పేమెంట్‌ అగ్రిగేటర్లకు ఎల్‌ఐసీ సువర్ణావకాశం? - LIC inviting bids from payment aggregators
close

Published : 03/03/2021 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేమెంట్‌ అగ్రిగేటర్లకు ఎల్‌ఐసీ సువర్ణావకాశం?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతిపెద్ద దేశీయ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ).. భారత్‌లోని చెల్లింపు గేట్‌వే ఆపరేటర్లకు సువర్ణావకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంస్థతో అనుబంధం ఉన్న 250 మిలియన్ల మంది పాలసీదారుల నుంచి ప్రీమియం సహా ఇతరత్రా చెల్లింపులను డిజిటల్‌గా స్వీకరించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే దేశంలోని పేమెంట్‌ అగ్రిగేటర్ల నుంచి బిడ్లకు ప్రతిపాదనలు పంపినట్లు ‘బిజినెస్ ఇన్‌సైడర్‌’ పేర్కొంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఆయా కంపెనీలకు ‘రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌’ పంపినట్లు సమాచారం. దేశంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న డిజిటల్‌ పేమెంట్స్‌తో లబ్ధిపొందుతున్న ఆయా సంస్థలకు ఇది ఓ సువర్ణావకామనే చెప్పాలి. రాత్రికి రాత్రే లక్షల మంది వినియోగదారులను సంపాదించుకునేందుకు రేజర్‌పే, పేటీఎం, పేయూ వంటి పేమెంట్‌ గేట్‌వేలకు ఇది ఓ చక్కని అవకాశం.

పేమెంట్‌ అగ్రిగేటర్లతో తమ వెబ్‌సైట్‌ను పూర్తిగా అనుసంధానించాలని ఎల్‌ఐసీ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ప్రీమియంతో పాటు ఇతరత్రా అన్ని రకాల చెల్లింపులకు సమగ్రమైన, ఆటోమేటెడ్‌ పరిష్కార మార్గం కనుగొనాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2017లోనూ ఎల్‌ఐసీ ఈ మేరకు బిడ్లను ఆహ్వానించింది. కానీ, వివిధ కారణాలతో అది అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాది ఎల్‌ఐసీ ఐపీవోకు రానున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో చెల్లింపులను పూర్తిగా డిజిటలైజ్‌ చేయాలని భావిస్తోంది. పేమెంట్‌ గేట్‌వేలతో అనుసంధానం కావడంతో ఎల్‌ఐసీ కూడా లబ్ధి చేకూరనుంది. ఆయా సంస్థల వద్ద ఉండే సమాచారం ఆధారంగా తమ పాలసీలను లక్షిత వినియోగదారులకు చేర్చేందుకు అవకాశం ఏర్పడనుంది.

ఇవీ చదవండి...

అగ్ర స్థానం నుంచి ‘మా’యం..!

ప్రపంచ కుబేరుల్లో హైదరాబాద్‌షా


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని