భారత్‌లో భారీగా కరోనా టీకా ఉత్పత్తి - Large corona vaccine production in India
close

Published : 31/12/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో భారీగా కరోనా టీకా ఉత్పత్తి

దేశీయ కంపెనీలతో అమెరికా సంస్థల జట్టు

దిల్లీ: భారత్‌లో భారీ ఎత్తున కరోనా టీకాలను ఉత్పత్తి చేయడం కోసం ప్రస్తుతానికి మూడు అమెరికా కంపెనీలు భారత భాగస్వాములతో జట్టుకట్టినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొవిడ్‌ నేపథ్యంలో భారత, అమెరికాల మధ్య వాణిజ్యం, సహకారం పెరిగిందని వివరించింది. దేశీయంగా సొంత పరిజ్ఞానంతో భారత్‌ బయోటెక్‌, జెన్నోవా, జైడస్‌ సంస్థలు కొవిడ్‌ టీకాలు అభివృద్ధి చేస్తుండగా.. ఆస్ట్రాజెనెకాతో సీరమ్‌, స్పుత్నిక్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌తో బయోలాజికల్‌ ఇ కలిసి టీకాలను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌, మారిషస్‌ల మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశకు వచ్చిందని వాణిజ్య శాఖ వివరించింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని