రేపటి నుంచి లక్ష్మిఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవో - Laxmi Organic Industries IPO opens on 15 March
close

Updated : 14/03/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేపటి నుంచి లక్ష్మిఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ ఐపీవో

ఇంటర్నెట్‌డెస్క్‌: రేపటి నుంచి లక్ష్మి ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్లోకి వచ్చేందుకు ఐపీవో బిడ్లను స్వీకరించనుంది. మార్చి 15వ తేదీన మొదలయ్యే ఈ ఐపీవో 17వ తేదీ వరకు కొనసాగుతుంది. దీనిలో షేరు ప్రైస్‌బ్యాండ్‌ను రూ.129 నుంచి రూ.130గా నిర్ణయించారు. బిడ్‌చేసే వారు కనీసం ఒక లాట్‌ (లాట్‌సైజు 115 ) వాటాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ నుంచి కంపెనీ రూ.600 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. దీనిలో కంపెనీకి చెందిన రూ.300 కోట్లు విలువైన వాటాలు, ప్రమోటర్‌ యెల్లో స్టోన్‌ గ్రూపునకు చెందిన రూ.300 కోట్లు విలువైన షేర్లను విక్రయిస్తున్నారు.

ఇప్పటికే కంపెనీ 12వ తేదీన 1.38 కోట్ల వాటాలను రూ.130 చొప్పున యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించింది. దీని నుంచి రూ.179.99 కోట్లను సమీకరించింది. ఐపీవో నుంచి సమీకరించిన మొత్తంతో సరికొత్త కర్మాగారం ఏర్పాటు చేయడం, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు తీర్చుకోవడం, ప్లాంట్‌, యంత్రాలు, ఆధునికీకరణ చేపట్టడం వంటివి చేయనుంది. దీంతోపాటు ఇప్పటికే  ఉన్న రుణాలను కూడా చెల్లించనుంది.

ప్రత్యేకమైన రసాయనాలు తయారు చేయడంలో లక్ష్మి ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌కు అనుభవం ఉంది. 2020 సెప్టెంబర్‌ నాటికి ముగిసిన ఆరు నెలల్లో కంపెనీ రూ.813 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. రూ.45.48కోట్ల నికర లాభాన్ని పొందింది.

ఇవీ చదవండి

కొత్తగా 66 విమాన సర్వీసులు
ఇండో-పసిఫిక్‌కు భారత్‌ ఓ భరోసా!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని