అంటురోగాలపై కలిసి పోరాడతాం - Let’s fight infections together
close

Published : 18/09/2021 02:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంటురోగాలపై కలిసి పోరాడతాం

 సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందంపై బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌మజుందార్‌షా

దిల్లీ: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లైఫ్‌ సైన్సెస్‌ (ఎస్‌ఐఎల్‌ఎస్‌), బయోకాన్‌ బయోలాజిక్స్‌ (బీబీఎల్‌) మధ్య కుదిరిన ఒప్పందం ఫలితంగా, ఇరు కంపెనీలు కలిసి అంటురోగాలపై మరింత ప్రభావవంతంగా పోరాడతాయని బీబీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ లైఫ్‌ సైన్సెస్‌కు 15 శాతం వాటాను ఆఫర్‌ చేస్తున్నట్లు బయోకాన్‌ బయోలాజిక్స్‌ గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వాటాకు ప్రతిగా 15 ఏళ్ల పాటు ఏటా 10 కోట్ల టీకా డోసులను బీబీఎల్‌ పొందుతుంది. ఈ భాగస్వామ్యంపై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అధర్‌ పూనావాలా మాట్లాడుతూ ‘10 కోట్ల టీకా డోసులనేది కనీసం మాత్రమే. అవకాశాలు అపరిమితంగా ఉన్నాయి. ఇరు సంస్థలు కలిసి ముడి పదార్థాల వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామ’ని అన్నారు. బయోకాన్‌ అనుబంధ సంస్థ బీబీఎల్‌ కాగా, సీసీఐ అనుబంధ సంస్థ ఎస్‌ఐఎల్‌ఎస్‌ అన్న సంగతి తెలిసిందే.


ఎగుమతులపై కేంద్రం చెప్పినట్లుగానే: పూనావాలా

కరోనా టీకాలపై ఎగుమతి ఆంక్షల సడలింపు ఎపుడు ఉండొచ్చని అడగ్గా..‘వచ్చే రెండు నెలల్లో ఎగుమతులపై ఆంక్షలు సడలించవచ్చు. అయితే ఆ నిర్ణయం ప్రభుత్వం చేతిలో ఉంది. కేంద్రం ఏది మంచిదని భావిస్తే అందుకు తగ్గట్లుగానే మేం నడుచుకుంటాం. ఎందుకంటే భారత్‌లో ఒక వేళ కొవిడ్‌ మూడో, నాలుగో దశలు వస్తే అందుకు తగ్గట్లుగా అవసరాలు, నిల్వల మధ్య సమతౌల్యం సాధించాల్సి ఉంటుంద’ని అన్నారు.


జీఎస్‌టీపై రెండు మంత్రివర్గ ఉపసంఘాల ఏర్పాటు

ప్రస్తుత సమావేశంలో రెండు మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటుచేసినట్లు నిర్మలాసీతారామన్‌ తెలిపారు. కొన్ని వస్తువులపై పన్నురేట్లను హేతుబద్దీకరించాలని కౌన్సిల్‌ ఎప్పటినుంచో కోరుతోందని, ఒక సంఘం అధ్యయనం చేసి 2 నెలల్లో నివేదిక అందిస్తుందని తెలిపారు. రెండో సంఘం ఇ- వే బిల్లులు, ఫాస్ట్‌ట్యాగ్స్‌, టెక్నాలజీ, కంప్లయన్సెస్‌, పన్నుఎగవేతల నివారణ, కంపోజిషన్‌ స్కీంలపై అధ్యయనం చేసి 2 నెలల్లో నివేదిక ఇస్తుందని చెప్పారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని