జీవితాంతం పింఛను కోసం.. - Lifetime pension with this
close

Updated : 02/07/2021 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవితాంతం పింఛను కోసం..

ఒకేసారి పెట్టుబడి పెట్టి, జీవితాంతం వరకూ పింఛను పొందే వీలు కల్పించేలా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ పథకం ఇమ్మీడియట్‌ యాన్యుటీ విభాగంలోకి వస్తుంది. ఈ పథకాన్ని కొనుగోలు చేసినప్పుడే ఎంత పింఛను వస్తుందనేది తెలిసిపోతుంది. 

ఈ పాలసీ కింద రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. జీవితాంతం వరకూ పింఛను పొందిన పాలసీదారుడి తదనంతరం పూర్తి మొత్తం నామినీలకు అందుతుంది. ఉమ్మడిగా తీసుకునే జాయింట్‌ లైఫ్‌ ఆప్షన్‌లో పాలసీదారుడి తర్వాత.. జీవిత భాగస్వామికి పింఛను అందుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత వారి వారసులు ఆ పెట్టుబడి మొత్తాన్ని తీసుకోవచ్చు. ఒకసారి ఈ పథకాన్ని తీసుకున్న తర్వాత ఆప్షన్లను మార్చడం కుదరదు.
40 ఏళ్లు పూర్తయిన వారు.80 ఏళ్లలోపు వారు ఈ పాలసీలో చేరేందుకు అర్హులు. నెలకు కనీసం రూ.1,000, ఏడాదికి రూ.12,000 వరకూ కనీస పింఛను వచ్చేలా యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా ఎలాంటి పరిమితి లేదు. యాన్యుటీ తీసుకున్న ఆరు నెలల నుంచి పాలసీదారుడు.. లేదా అతనిపైఆధారపడిన వారు తీవ్ర అనారోగ్యం బారిన పడినప్పుడు.. దీన్ని స్వాధీనం చేయొచ్చు. దీనికి కొన్ని నిబంధనల మేరకు అంగీకరిస్తారు. ఆరు నెలల తర్వాత కొంత రుణం తీసుకునే వీలుంది. 60 ఏళ్ల వ్యక్తి రూ.10లక్షలతో యాన్యుటీ కొనుగోలు చేస్తే..ఆప్షన్‌ 1లో ఏడాదికి రూ.51,650 పింఛను అందుతుంది. ఆప్షన్‌ 2లో రూ.51,150 ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఈ యాన్యుటీని కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాన్నీ ఎల్‌ఐసీ ప్రకటించింది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని