Work From Home: ఈ కంపెనీలో ఇకపై పూర్తిగా ‘ఇంటి నుంచి పని’ అవకాశం! - LinkedIn Allows Staff To Work Fully work from home
close

Published : 30/07/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Work From Home: ఈ కంపెనీలో ఇకపై పూర్తిగా ‘ఇంటి నుంచి పని’ అవకాశం!

వాషింగ్టన్‌: ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ ఆధ్వర్యంలోని సామాజిక మాధ్యమం లింక్డిన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఉద్యోగులకు పూర్తిగా ‘ఇంటి నుంచి పని’ చేసే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం కల్పించింది. అవసరమైతే పార్ట్‌టైమ్‌ ఆఫీసుకి వచ్చే వెసులుబాటు కూడా కల్పించనుంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న 16000 మంది ఉద్యోగులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.

అయితే, కొన్ని విధులు ఆఫీసుకు వస్తే గానీ పూర్తి చేయలేమని.. అలాంటి పనుల్లో ఉన్నవారు మాత్రం కచ్చితంగా కార్యాలయానికి రావాల్సిందేనని లింక్డిన్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే, కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నివాస స్థలాన్ని మారిస్తే.. ఆ ప్రాంతానికి అనుగుణంగానే వేతనాలు ఉంటాయని తెలిపింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని