డేటా లీక్‌: నిన్న ఫేస్‌బుక్‌.. నేడు లింక్డ్‌ఇన్‌! - Linkedin users data leaked
close

Published : 09/04/2021 16:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డేటా లీక్‌: నిన్న ఫేస్‌బుక్‌.. నేడు లింక్డ్‌ఇన్‌!

50 కోట్ల మంది సమాచారం అమ్మకానికి

దిల్లీ: యాభై కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం లీక్ అయిన విషయం ఇంకా మరువక ముందే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. ప్రొఫెషనల్‌ సోషల్‌ మీడియాగా చెప్పుకునే లింక్డ్‌ఇన్‌ యూజర్ల వివరాలు సైతం తాజాగా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయినట్లు సమాచారం. ఈ మేరకు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్‌ చేసిన సదరు సైబర్‌ నేరగాడు.. దాన్ని ఓ వెబ్‌సైట్‌లో అమ్మకానికి ఉంచినట్లు సైబర్‌న్యూస్‌ అనే వార్తా సంస్థ పేర్కొంది.

మొత్తం నాలుగు ఫైళ్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయని వాటిలో లింక్డ్‌ఇన్‌ వినియోగదారుల ఐడీలు, పూర్తి పేర్లు, ఫోన్‌నంబర్లు, ఇతర సామాజిక మాధ్యమాలకు సంబంధించిన లింకులు, వ్యక్తి ప్రొఫెషనల్‌ టైటిల్‌ సహా మరికొన్ని కీలక వివరాలు ఉన్నాయని సమాచారం. ఈ సమాచారాన్ని సదరు హ్యాకర్‌ కొన్ని వేల డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్లకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దీనిపై స్పందించిన లింక్డ్‌ఇన్‌.. ఆ వివరాలు లింక్డ్‌ఇన్‌ యూజర్ల ఫొఫైళ్ల నుంచి హ్యాక్‌ చేసినవి కాదని తెలిపింది. కొన్ని వెబ్‌సైట్లు, కంపెనీల నుంచి సేకరించిన వివరాల సమాహారమని పేర్కొంది.

దాదాపు 50 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారం ఆన్‌లైన్‌లో కనిపించడం ఇటీవల కలకలంరేపిన విషయం తెలిసిందే. 106 దేశాలకు చెందిన వినియోగదారుల ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్‌ ఐడీలు, చిరునామాలు అమ్మకానికి ఉంచారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని