ఈ పథకాలు కొత్తగా.. ! - List of schemes launched by the finance minister
close

Published : 01/02/2021 22:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ పథకాలు కొత్తగా.. !

 వైద్యానికి పెద్దపీట

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని  కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. వీటిల్లో ఆరోగ్యానికి సంబంధించిన పీఎం ఆత్మనిర్భర్‌ స్వస్త్‌ భారత్‌ యోజన కీలకమైంది. జల్‌జీవన్‌ మిషన్‌ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలు కూడా ఉన్నాయి. 

1)  పీఎం ఆత్మనిర్భర్‌ స్వస్త్‌ భారత్‌ యోజన

 కేంద్రం నిర్వహించే ఈ పథకం కోసం రూ.64,180 కోట్లను కేటాయించింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌కు అదనంగా దీనిని ఏర్పాటుచేసింది. 17వేల గ్రామీణ, 11వేల పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ స్కీం ఏర్పాటు చేశారు.  అన్నిజిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌ల ఏర్పాటు. 9 బయోసేఫ్టీ లెవల్‌-3 ల్యాబ్‌ల  ఏర్పాటు వంటివి ఉన్నాయి. 

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ను బలోపేతం చేసేలా 12 సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్ల ఏర్పాటు. దీంతోపాటు ఐదు స్థానిక బ్రాంచిలు.. మెట్రోపాలిటిన్‌ హెల్త్‌ సర్వైలైన్స్‌ సెంటర్ల ఏర్పాటు వంటి చేపట్టనున్నారు. 

2)  మిషన్‌ పోషణ్‌ 2.0

పోషక పదార్థాలను అవసరమైన వారికి అందేట్లు చేయడం. దీంతోపాటు ది సప్లిమెంటరీ న్యూట్రిషన్‌ ప్రోగ్రాం, పోషణ్‌ అభియాన్‌ను విలీనం చేయడం. 112 జిల్లాల్లో పోషక లోపాలను సరిచేసేలా చూడటం. 

3) జల్‌జీవన్‌ మిషన్‌

వచ్చే ఐదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీరు అందించేందుకు 2,87,000 జల్‌జీవన్‌ మిషన్‌ అర్భన్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించారు. దీనిలో 2.86కోట్ల మందికి కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. 4,378 పుర, నగర పాలక సంస్థలకు మంచినీటిని సరఫరా చేయనున్నారు. దీంతోపాటు 500 అమృత్‌ నగరాల్లో లిక్విడ్‌ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ నిర్వహించడం. 

4) తుక్కు విధానం

ప్రభుత్వం సరికొత్తగా వాహనాల తుక్కు విధానం ప్రకటించింది. దశలవారీగా పాత వాహనాలను పక్కన పెట్టేందుకు దీనిని అమలు చేయనున్నారు. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు.. వాణిజ్యవాహనాలకు 15ఏళ్లు జీవితకాలంగా నిర్ణయించారు. 

ఇవీ చదవండి

20 ఏళ్లు దాటితే వాహనాలు తుక్కుకే..!

ఈ ఏడాది ఐపీవోకు ఎల్‌ఐసీ..!
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని