ఈ చిన్న మొత్తాల పథకాలపై రుణం పొందొచ్చని తెలుసా? - Loan against small savings schemes
close

Updated : 07/07/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ చిన్న మొత్తాల పథకాలపై రుణం పొందొచ్చని తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి చాలా మందికి తెలుసు. దీర్ఘకాలిక పెట్టుబడులపై అధిక వడ్డీ రేట్లను అందిస్తుంటాయి ఈ పథకాలు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో డబ్బును సమకూర్చుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అలా రుణాలు తీసుకునేందుకు వీలున్న రెండు చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కిసాన్ వికాస్ పత్ర: ప్రస్తుతం కిసాన్ వికాస్ ప‌త్ర వ‌డ్డీ రేట్లు 6.9 శాతంగా ఉన్నాయి. పెట్టుబడి పెట్టిన 10 సంవత్సరాల నాలుగు నెలల్లో రెట్టింపు అవుతుంది. ఇది ప్రస్తుతం మెచ్యూరిటీ కాలం కూడా. పెట్టుబడిదారుడు ₹1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు.

జాతీయ పొదుపు సర్టిఫికెట్ (ఎన్ఎస్‌సీ): ఇది ఐదేళ్ల గ‌డువుతో కూడిన పెట్టుబ‌డి ప‌థ‌కం. ఇది ప్ర‌స్తుతం 6.8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. కిసాన్ వికాస్ ప‌త్ర మాదిరిగానే కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. పెట్టుబడి పెట్టిన ప్రతి రూ 1,000 ఐదేళ్ల తర్వాత రూ.1,389.49కు పెరుగుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ప‌థ‌కాల మెచ్యూరిటీ వ్యవధి మూడేళ్లలోపు ఉంటే రుణగ్రహీతలు ఈ రెండు ప‌థ‌కాల విలువలో 85 శాతం వరకు రుణంగా పొందొచ్చు. మెచ్యూరిటీ గ‌డువు మూడేళ్లకు పైగా ఉంటే పెట్టుబ‌డి విలువ‌లో 80 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. ఒక వ్యక్తి ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కోసం ఈ సెక్యూరిటీలను కూడా త‌న‌ఖా పెట్టొచ్చు.

అయితే, ఈ రుణాలపై వ‌డ్డీ రేట్లను నేష‌న‌ల్ స‌ర్టిఫికెట్ లేదా కిసాన్ వికాస్ ప‌త్ర రేటు కంటే ఎక్కువ‌గా బ్యాంకులు వ‌సూలు చేస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం ఈ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు 11.9 శాతంగా ఉన్నాయి. ఈ ప‌థ‌కాల‌ను బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలతో పాటు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కార్పొరేష‌న్లు, ప్ర‌భుత్వ సంస్థలు, స్థానిక అధికారిక‌ సంస్థ‌లు, దేశ అధ్య‌క్షుడు, రాష్ర్ట గ‌వ‌ర్నర్ అధికారిక సంస్థ‌లు, వ్య‌క్తుల‌ వ‌ద్ద తాక‌ట్టు పెట్టొచ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని